వీడియో గేమ్ ద్యాసలో పడి, తుఫానునే మరిచిపోయాడు

Posted By: BOMMU SIVANJANEYULU

వీడియో గేమ్ వ్యసనం అతనని తుఫానను సైతం మరిచిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే నార్త్ కారోలినా, గ్రీన్స్‌బోరోకు చెందిన అంటోన్ విలియమ్స్ అనే యువకుడు తన ఇంట్లో కూర్చోని ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడుతన్నాడు. అప్పటికే ఆ ప్రాంతాన్ని ఓ భయానక సుడిగాలి (టోర్నడో) చుట్టముట్టింది. ఆ విషయాన్ని పూర్తిగా ఆదమరిచిన విలియమ్స్ గేమ్‌ను ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఇంట్లోనే ఉండిపోయాడు. ఉన్నట్టుండి పెద్దపెద్ద శబ్ధాలు వినిపిస్తుండటంతో కిటికిలోంచి చూసిన అతనికి సుడిగాలి ధాటికి గాల్లో ఎగురుతోన్న పొరుగింటి పై కప్పులు కనిపించాయి. వాటిని చూసి ఏ మాత్రం కంగారుపడిని విలియమ్స్ తిరిగి తన రూమ్‌లోకి వెళ్లి మిగిలి ఉన్న గేమ్‌ను ఫినిష్ చేసి విజేతగా నిలిచాడు. ఆ సమయంలో పవర్ లైన్‌లు కూడా తెగిపడ్డాయని, ఇంట్లో తనతో పాటు ఉన్న చెల్లి బాత్రూమ్‌లో దాక్కుందని విలయమ్స్ తెలిపాడు.

వీడియో గేమ్ ద్యాసలో పడి, తుఫానునే మరిచిపోయాడు

ఫోర్ట్‌నైట్ గేమ్ గురించి..
అత్యతం ప్రజాదరణను కలిగి ఉన్న ఈ వీడియో గేమ్‌లో వంది మంది ప్లేయర్స్ ఉంటారు. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు. ప్లేయర్స్‌కు ఇచ్చే మ్యాప్స్ ఆధారంగా ఆయుధాలను సమకూర్చుకోవల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్లేయర్స్ ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ శత్రువులను తుదిముట్టిస్తూ, తమకు కేటాయించిన టాస్కులను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఒక్కో లెవల్ పెరిగేకొద్ది గేమ్ మరింత క్లిష్టతరంగా మారుతుంది. చివరి లెవల్ వరకు ప్లేయర్ బ్రతికి ఉండి టాస్కులను పూర్తి చేసినట్లయితే విజేతగా నిలుస్తారు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ వాడుతున్నారా? ఈ 8 సీక్రెట్లు గురించి తెలుసుకోవాల్సిందే

చిన్నారులను చెడుదోవ పట్టించే ప్రమాదం..
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్ లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు.

హెచ్చరిస్తోన్న నిపుణులు
గంట.. రెండు గంటలయితే పర్వాలేదు కానీ కొంత మంది ఏకధాటిగా నిద్రహారాలు మానుకుని వీడియోగేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
Anton Williams was playing Fortnite in his room when the tornado hit land in Greensboro, North Carolina.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot