Home
News

కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోన్న ఫోర్ట్‌నైట్ గేమ్!

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వీడియో గేమ్స్ కొత్త లెవల్‌కు తీసుకువెళుతున్నప్పటికి సమాజం పై చెడు ప్రభావాన్ని మాత్రం చూపుతూనే ఉన్నాయి.

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వీడియో గేమ్స్ కొత్త లెవల్‌కు తీసుకువెళుతున్నప్పటికి సమాజం పై చెడు ప్రభావాన్ని మాత్రం చూపుతూనే ఉన్నాయి. వీడియో గేమ్స్ పట్ల అడిక్ట్ అవుతోన్న చాలా మంది యువత చెడు లైఫ్‌స్టైల్‌ను అలవర్చుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ గేమింగ్ జాడ్యం యువతను మాత్రమే కాదు కుటుంబాలను సైతం సంక్షోభంలోని నేట్టేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు 200 విడాకులు..

ఇప్పటి వరకు 200 విడాకులు..

ఇంటర్నెట్‌ను కుదిపేస్తోన్న ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ ఫోర్ట్‌నైట్ (Fortnite) కుటుంబాల మధ్య పెద్ద చిచ్చే పెడుతుతోంది. యూకేకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ డివోర్స్ ఆన్‌లైన్ (Divorce Online)కు 2018కిగానూ ఇప్పటి వరకు 4,665 డివోర్స్ పిటీషన్ రిక్వెస్ట్‌లు అందగా వాటిలో 200 వరకు డివోర్స్ పిటీషన్ రిక్వెస్ట్స్ ఫోర్ట్‌నైట్ ఇంకా ఇతర ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా విడాకులు కోరుకుంటున్నట్లు ఉన్నాయట.

 

 

ప్రమాదాకరమని తెలిసినప్పటికి...

ప్రమాదాకరమని తెలిసినప్పటికి...

కోట్లాది మంది యూజర్లతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఫోర్ట్‌నైట్ ఇంకా పూర్తిస్థాయిలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలోకి అందుబాటులోకి రాలేదు. అయినప్పటికి పలు థర్డ్‌ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా ఈ గేమ్‌ను పొందేందుకు గేమర్స్ వెనకాడటం లేదు. ఇలా చేయటం ప్రమాదాకరమని తెలిసినప్పటికి వారు వెనుకంజ వేయటం లేదు.

 

 

క్షణంక్షణం ఉత్కంఠభరితం...

క్షణంక్షణం ఉత్కంఠభరితం...

ఫోర్ట్‌నైట్ వీడియో గేమ్‌లో వంది మంది ప్లేయర్స్ ఉంటారు. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు. ప్లేయర్స్‌కు ఇచ్చే మ్యాప్స్ ఆధారంగా ఆయుధాలను సమకూర్చుకోవల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్లేయర్స్ ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ శత్రువులను తుదిముట్టిస్తూ, తమకు కేటాయించిన టాస్కులను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఒక్కో లెవల్ పెరిగేకొద్ది గేమ్ మరింత క్లిష్టతరంగా మారుతుంది. చివరి లెవల్ వరకు ప్లేయర్ బ్రతికి ఉండి టాస్కులను పూర్తి చేసినట్లయితే విజేతగా నిలుస్తారు.

 

 

మానసికంగా శారీరకంగా...

మానసికంగా శారీరకంగా...

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగా ఇంకా శారీరకంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్‌లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోట మచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Fortnite Video Game Caused Over 200 Divorces.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X