ఇండియాలో అందుబాటులోకి వచ్చిన 'ఫాసిల్ స్మార్ట్ వాచ్' !

|

ప్రీమియమ్ వాచ్ బ్రాండ్ ఫాసిల్ భారత మార్కెట్లో ఫాసిల్ స్పోర్ట్స్ అనే కొత్త మోడల్ను ప్రారంభించింది. ఈ స్మార్ట్ వాచ్ Google యొక్క వేర్ OS తో నడుస్తుంది. స్మార్ట్ వాచ్ విఫణిలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ వాచ్OSతో ఆపిల్ మొదటి స్థానాన్ని మరియు gear OSతో శామ్సంగ్ తర్వాత స్థానాన్ని కలిగి ఉంది.

fossil launches smartwatch india running google s wear os

Google యొక్క వేర్ OS విజయం అదే స్థాయిని అనుభవిస్తున్నట్లు లేదు. ఫాసిల్ వాచ్ లు వేర్OSతో ప్రీమియమ్ స్పోర్ట్స్ వాచ్ లు 41mm మరియు 43mm రెండు పరిమాణాలలో ప్రారంభించింది.స్ట్రాప్స్ కూడా రెండు 18 మిమీ మరియు 22 మిమీ పరిమాణాలలో మార్చవచ్చు.

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 3100 SoC ప్రాసెసర్ తో ఫాసిల్ స్పోర్ట్స్ వాచ్ అమర్చబడి ఉంటుంది.2018 లో చిప్ సెట్ ను ప్రాసెసర్ మేకర్స్ ప్రారంభించారు మరియు యాదృచ్ఛికంగా ఫాసిల్ స్పోర్ట్ కూడా అదే సమయంలోనే ప్రారంభించబడింది.ఈ కొత్త చిప్సెట్ తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ వాచ్ గా ఫాసిల్ స్పోర్ట్స్ వాచ్ ను చెప్పవచ్చు.ఈ వాచ్ ఇప్పుడు ఇండియాకు తీసుకువస్తున్నారు

కీ ఫీచర్స్:

కీ ఫీచర్స్:

ఈ ఫాసిల్ స్పోర్ట్స్ వాచ్ ప్రతేకమైన ఫీచర్స్ తో వస్తుంది.ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు హృదయ స్పందన సెన్సార్, GPS, ఆల్టమీటర్, గైరోస్కోప్, యాక్సలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్ మరియు మైక్రోఫోన్. ఈ డివైస్ Android మరియు iOS లతో రన్ అయే స్మార్ట్ ఫోన్ను బ్లూటూత్ ను ఉపయోగించి కలపవచ్చు.ఈ వాచ్ ఒక రోజు పాటు పూర్తిగా బ్యాటరీ లైఫ్ ను అందిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్3100 ప్రాసెసర్ కు మద్దతు ఇస్తుంది.

ధరలు:

ధరలు:

ఇండియాలో ఫాసిల్ స్పోర్ట్స్ స్మార్ట్ వాచ్ ధర 17,995 రూపాయలు.దీనిని ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లలో చాలా రకాల సోర్సెస్ నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.దేశవ్యాప్తంగా ఉన్న ఫాసిల్ దుకాణముల నుండి కూడా ఫాసిల్ స్పోర్ట్స్ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చెయవచ్చు.

ఆండ్రాయిడ్ OS ఎన్విరాన్మెంట్ లో శామ్సంగ్ వాచ్ లు Gear OSతో నడుస్తాయి. స్పోర్ట్స్ స్మార్ట్ వాచ్ పోటీలలో శామ్సంగ్ డివైస్ లకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న కొనుగోలుదారులు ఫాసిల్ స్పోర్ట్స్ స్మార్ట్ వాచ్ ను ఇష్టపడతారు.

 

Best Mobiles in India

English summary
fossil launches smartwatch india running google s wear os

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X