వ్యవహారాలు వేగవంతం చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు

Posted By: Staff

వ్యవహారాలు వేగవంతం  చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు

వ్యవహారాలు వేగవంతం చేసేందుకు కార్పొరేట్‌ సంస్థలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా వీడియో కాన్ఫరెన్స్‌ను వినియోగిస్తోంది. దేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలకు 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.25,000 కోట్లు) వ్యాపారం ఉందని గుర్‌గావ్‌కు చెందిన బిజినెస్‌ ఆక్టేన్‌ సంస్థ అంచనా వేస్తోంది. చిత్రం, మాటల్లో స్టూడియో స్పష్టత ఉండే సొల్యూషన్స్‌ను సంస్థ రూపొందించింది. 3- 40 ప్రదేశాల నుంచి 18-600 మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో మాట్లాడుకునే సౌలభ్యాన్ని తాము రూపొందించిన టెలీ ఆల్‌ ప్రెజెన్స్‌ కల్పిస్తుందని బిజినెస్‌ ఆక్టేన్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ బన్సల్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి 7 వెర్షన్‌లను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు.

వివిధ ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా పరిశీలించేందుకు, మాట్లాడే సభ్యుడు మన ఎదుటే వ్యక్తి ఉన్నారన్న భావన కలిగేంత స్పష్టత ఇచ్చే ఇమ్మర్సివ్‌ డైనమిక్‌ టెలీఆల్‌ప్రెజెన్స్‌ సొల్యూషన్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ పరికరాలను అనుసంధానించేందుకు 1 ఎంబీపీఎస్‌ నుంచి 16 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌ అవసరం. ప్రతి కేంద్రంలో ఈ పరికరాల ఏర్పాటుకు రూ.40 లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు అవుతుంది. ఏటా నిర్వహణ ఖర్చు కింద రూ.2 లక్షలు, బ్యాండ్‌విడ్త్‌ కోసం రూ.6-8 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. 3జీ నెట్‌వర్క్‌ పరిధిలోని వ్యక్తితోనూ ఈ ప్లాట్‌ఫాంపై వీడియోకాల్‌ మాట్లాడవచ్చు. ఈ సొల్యూషన్స్‌పై 3 పేటెంట్‌లకు దరఖాస్తు చేశామని సంజయ్‌ తెలిపారు.

తమ టెలీప్రెజెన్స్‌ పరికరాలకు వేదాంత గ్రూప్‌, ఎయిరిండియా, ఎస్‌బీఐ వంటి దిగ్గజ ఖాతాదారుల సంస్థలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 మంది ఖాతాదారులను ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. టెలీఆల్‌ప్రెజెన్స్‌ సొల్యూషన్స్‌ ప్రదర్శనా (డెమో) కేంద్రాలను హైదరాబాద్‌తో పాటు గుర్‌గావ్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 30 కేంద్రాల ఏర్పాటుకు 50 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.225 కోట్లు) వెచ్చిస్తామని ఆయన చెప్పారు. ఉన్నత విద్యా బోధనకు వినియోగించే లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot