త్వరలో మార్కెట్‌లోకి రానున్న నోకియా విండోస్ ఫోన్స్ ఇరగదీశాయ్...!

Posted By: Staff

త్వరలో మార్కెట్‌లోకి రానున్న నోకియా విండోస్ ఫోన్స్ ఇరగదీశాయ్...!

భారత మొబైల్ మార్కెట్‌లో నోకియాకి ప్రత్యేకమైనటువంటి స్దానం. ఆ స్ధానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడూ కొత్త టెక్నాలజీలను, కొత్త మోడళ్శను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా నోకియా త్వరలో నాలుగు విండోస్ స్మార్ట్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ నాలుగు స్మార్ట్ ఫోన్స్ గతంలో నోకియా కంపెనీ నుండి విడుదలైనటువంటి నోకియా ఈ7, నోకియా ఎన్8 మాదరి ఉండబోతున్నాయి. ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే క్యాండీ బార్ ఎంట్రప్రైజ్ డివైస్‌తో పాటు, క్వర్టీ కీబోర్డ్, నోకియా ఈ6 మాదిరే టచ్ స్క్రీన్ ఉంటుంది. మొబైల్ రివ్యూ ప్రకారం నోకియా కంపెనీ ఎప్పుడూ ఒకే రకమైనటువంటి డిజైన్‌ని మార్కెట్‌లో ఎక్కువ కాలం కోనసాగనివ్వదు. ఒక డిజైన్ విడుదల చేసిన తర్వాత వెంటనే వేరోక డిజైన్‌లోకి అడుగెడుతున్న విషయం మనం ప్రత్యక్షంగా చూసిందే.


ఇక మొట్టమొదటి డివైస్ ఎక్స్7 వేరియంట్‌ని కలిగిఉండి విండోస్7 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ నోకియా డబ్ల్యు7గా నామకరణం చేశారు. ఐతే ఇదే ఫైనల్ పేరు అని అనుకోకూడదు. ఈ డివైస్ Qualcomm QSD8250 processorతో పాటు, WVGA display కలిగిఉండి సేమ్ టు సేమ్ నోకియా ఈ7 లాగా ఉంటుందంటున్నారు. అదే విధంగా 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది నోకియా మొట్టమొదటి విండోస్ ఫోన్. దీనిని 2011,Q4లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆ తర్వాత నోకియా ఎన్8 వేరియంట్ పోన్. 12మెగా ఫిక్స్ కెమెరా కలిగిఉండి ఓరిజినల్ ఎన్8 పోన్ మాదిరే ఉంటుంది. ఇది నోకియా మొట్టమొదటి డ్యూయల్ కోర్ స్మార్ట్ పోన్. దీనిని 2012,Q1లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నోకియా ఈ6 వేరియంట్. ఈ పోన్‌ని ప్రత్యేకంగా ఎంటర్పైజ్ పోకస్ చేసేవిధంగా రూపోందిచడం జరుగుతుంది. ఈ పోన్ ప్రస్తుతం ఉన్నటువంటి సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్‌వేర్ కలిగి ఉంటుంది.


ఇలా నోకియా కంపెనీ కేవలం నాలుగు డివైజెస్‌ని మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇలా నోకియా కంపెనీ తన విండోస్ ఫోన్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసి రెండవ తరం వేవ్‌ని క్రియేట్ చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot