మీరున్న లొకేషన్ షేర్ చేసేందుకు ప్రధాన మార్గాలు తెలుసుకోండి

By Gizbot Bureau
|

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది.అయితే లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌తో అమ్మాయిలకు సెక్యూరిటీ కూడా పెరుగుతూ వస్తోంది.

Four Ways to Share Your Location on Mobile

అనుకోని ప్రమాదంలో ఉన్నా, లేదా కొత్త రూట్‌లో వెళ్లినా లొకేషన్ షేరింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ క్షణంలో ఎక్కడ ఉన్నామో లొకేషన్ షేర్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లభిస్తుంది. మరి మీ లొకేషన్ షేర్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. వాటిల్లో బెస్ట్ అనిపించే నాలుగు మార్గాలను ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కూయండి.

వాట్సప్‌లో లొకేషన్ షేరింగ్

వాట్సప్‌లో లొకేషన్ షేరింగ్

మీరు వాట్సప్ వాడుతున్నట్లయితే లొకేషన్ షేర్ చేయడం చాలా ఈజీ. ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. మీరు ఎవరికి లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. మెసేజ్ టైప్ చేసే బాక్స్‌లో కనిపించే అటాచ్‌మెంట్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో గ్యాలరీ, ఆడియో, కాంటాక్ట్‌తో పాటు లొకేషన్ ఐకాన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లొకేషన్ షేర్ చేయొచ్చు. మీ లొకేషన్‌ని ఎంత సేపు షేర్ చేయాలో కూడా ఆ సమయాన్ని మీరే నిర్ణయించొచ్చు. మీరు లొకేషన్ షేర్ చేసిన తర్వాత షేరింగ్ ఆపాలంటే Stop Sharing పైన క్లిక్ చేస్తే చాలు.

 ఎస్ఎంఎస్‌లో లొకేషన్ షేరింగ్

ఎస్ఎంఎస్‌లో లొకేషన్ షేరింగ్

మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ లొకేషన్ షేర్ చేయొచ్చు. వాట్సప్‌లో చేసినట్టుగానే స్టెప్స్ ఉంటాయి. ముందు అటాచ్‌మెంట్ ఐకాన్ పైన క్లిక్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేయాలి. ఎస్ఎంఎస్‌లో గూగుల్ మ్యాప్స్ ఐడీ వెళ్తుంది. ఆ ఐడీ క్లిక్ చేస్తే మీ లొకేషన్ కనిపిస్తుంది.

 గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ షేరింగ్

గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ షేరింగ్

ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ కార్నర్‌లో ఆప్షన్స్ ఓపెన్ చేసి లొకేషన్ షేరింగ్ క్లిక్ చేయండి. యాడ్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎవరికి లొకేషన్ షేర్ చేయాలో క్లిక్ చేయండి. మీరు అవతలివారి జీమెయిల్, వాట్సప్, జీమెయిల్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా మీ లొకేషన్ షేర్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్‌ను 1 గంట లేదా మీరు ఆఫ్ చేసే వరకు షేర్ చేయొచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో లొకేషన్ షేరింగ్

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో లొకేషన్ షేరింగ్

ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేస్తే మెసేజ్ బాక్స్‌లో కుడివైపు జీపీఎస్ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది. లొకేషన్‌ను ఆన్ చేసిన తర్వాత మీరు ఏ మెసేజ్ పంపినా లొకేషన్ మెసేజ్ కూడా వెళ్తుంది. అయితే మీరు మీ లొకేషన్ షేర్ చేయాలంటే మీ ఫోన్‌లో లొకేషన్ తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి. ఇవి కాకుండా లొకేషన్ షేర్ చేయడానికి Find My Friends, Life360, Family Locator, Glympse లాంటి యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
From WhatsApp to Google Maps, Here are Four Ways to Share Your Location on Mobile

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X