Home
News

దడ పుట్టిస్తున్న పోర్న్, దెబ్బకి మొబైల్స్ బ్యాన్ చేశారు

అందాలు ఆరబోసినట్టు కనిపించే సుందర నగరం ఫ్రాన్స్ తమ దేశ పిల్లల కోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది.

By Hazarath Aiah

అందాలు ఆరబోసినట్టు కనిపించే సుందర దేశం ఫ్రాన్స్ తమ దేశ పిల్లల కోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ వ్యసనం బారి నుంచి పాఠశాల విద్యార్థులను రక్షించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పాఠశాలల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధించే బిల్లును జాతీయ అసెంబ్లీ(దిగువ సభ)లో ప్రవేశపెట్టింది. మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎగువ సభకు బిల్లును పంపించారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొం‍దినట్లైతే ఈ విద్యా సంవత్సరం(సెప్టెంబరు) నుంచే మొబైల్స్ పై నిషేధం అమలులోకి రానుంది.

పారిస్‌ వరకే పరిమితం చేయాలా..

పారిస్‌ వరకే పరిమితం చేయాలా..

ఈ నిబంధనను పారిస్‌ వరకే పరిమితం చేయాలా లేదా దేశ వ్యాప్తంగా అమలు చేయాలా అనే అంశంపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సభ్యులు తెలిపారు.

సెల్‌ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు..

సెల్‌ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు..

దివ్యాంగ , విద్యా, సాంస్కృతిక కార్యకలాపాల కోసం సెల్‌ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు. ఇందుకు సంబంధించి పూర్తి నియమావళిని రూపొం‍దిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

7 నుంచి 12 ఏళ్లలోపు..

7 నుంచి 12 ఏళ్లలోపు..

7 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 90 శాతం మంది సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు.

 

స్మార్ట్‌ఫోన్‌ వాడకం వల్ల..

స్మార్ట్‌ఫోన్‌ వాడకం వల్ల..

స్మార్ట్‌ఫోన్‌ వాడకం వల్ల పిల్లలు సైబర్‌ ప్రమాదాల బారిన పడుతుండటం, పోర్న్‌సైట్లు చూసే కల్చర్‌ పెరిగి పోతుండటంతో కనీసం స్కూళ్లో అయిన నిషేధం అనివార్యమని పలువురు అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.

బిల్లు గురించి ప్రస్తావిస్తూ..

బిల్లు గురించి ప్రస్తావిస్తూ..

ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ‘స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్లపై సాధారణ నిషేధం విధించే బిల్లుకు జాతీయ అసెంబ్లీలో పూర్తి మద్దతు లభించింది.

మాక్రాన్‌ ట్వీట్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ పూర్తైనట్లే. నా నిబద్ధత నిరూపించుకున్నా' అంటూ మాక్రాన్‌ ట్వీట్‌ చేశారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Many French students will have their social media scrolling forcibly ended during school hours this upcoming year, after French lawmakers voted to ban smartphone use in schools more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X