30 రోజుల పాట ఉచితంగా 3జీ కనెక్టువిటీ: ఎయిర్‌సెల్

Posted By:

తమ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులు 30 రోజుల పాటు రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, 3జీ కనెక్టువిటీ సేవలను ఉచితంగా పొందవచ్చని ఎయిర్‌సెల్ ప్రకటించింది. ప్రస్తుత, నూతన ఖాతాదారకులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్‌సెల్ ప్రాంతీయ అధిపతి (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా) హమీర్ భక్షి తెలిపారు.

‘ఎయిర్‌సెల్ 3జీ మార్నింగ్స్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు *122*5*1# లేదా *122*456#కు డయల్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్‌ను విజయవంతంగా యాక్టివేస్ చేసుకున్నట్లు కొద్ది సేపటిలోనే ధృవీకరణ సందేశం అందుతుంది. పూర్తిస్థాయిలో 3జీ డేటాను అపరిమితంగా వినియోగించుకునేందుకు వివిధ వ్యాలిడిటీ టైమ్ ఫ్రేమ్‌లను బట్టి రోజుకు రూ.8 నంచి రూ.997 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

30 రోజుల పాట ఉచితంగా 3జీ కనెక్టువిటీ: ఎయిర్‌సెల్

యూనినార్ కొత్త ఆఫర్.. ‘కౌన్ బనేగా లక్ పతి'

ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ యూనినార్ ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం లక్ష రూపాయల బంపర్ బహుమతని గెలుచుకునే ‘కౌన్ బనేగా లక్ పతి' పోటీని నిర్వహిస్తున్నట్లు యూనిరనా్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీలో పాల్గొనటం ద్వారా బంపర్ బహుమతిగా రూ.లక్ష, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లు ఇంకా ఇతర బహుమతులను గెలుచుకోవచ్చని సతీష్ కుమార్ వివరించారు. క్రికెట్, బాలీవుడ్, కరంట్ ఆఫైర్స్‌కు సంబంధించి మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలివ్వడం ద్వారా ఈ బహుమతలులు గెలుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పార్టిసిపేషన్ ఛార్జ్ నిమిత్తం రోజుకు రూ.3చొప్పున వసూలు చేస్తామని కుమార్ వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting