అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?

|

టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తాను అందిస్తున్న రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకున్న వారికి లేదా ఇప్పటికే ఆ ప్లాన్లలో ఉన్నవారికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అమెజాన్ సంస్థతో భాగస్వామ్యం అయిన వొడాఫోన్ ఈ ఆఫర్‌ను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. వొడాఫోన్ అందిస్తున్న ఈ ఆఫర్‌ను పొందాలంటే ఆ కంపెనీకి చెందిన యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

Airtel భారీ తగ్గింపు ఆఫర్లు, 6నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై..Airtel భారీ తగ్గింపు ఆఫర్లు, 6నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై..

కొత్త వెర్షన్‌కు అప్‌డేట్

కొత్త వెర్షన్‌కు అప్‌డేట్

ఇప్పటికే యాప్‌ను వాడే వారు దాన్ని కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేస్తే అందులో హోమ్ పేజీలో అమెజాన్ ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.

ఓటీపీ

ఓటీపీ

అనంతరం వచ్చే స్క్రీన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి. దీంతో ఆఫర్ లభిస్తుంది.

ఈ-మెయిల్ ఐడీ

ఈ-మెయిల్ ఐడీ

అనంతరం కస్టమర్ ఎంచుకున్న ఈ-మెయిల్ ఐడీకి ఆఫర్‌ను ఇస్తారు. దాంతో అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌గా లాగిన్ అయితే చాలు, అమెజాన్ ప్రైమ్ మెంబర్ అవుతారు.

ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్
 

ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్

అలా రూ.999 విలువైన ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను వొడాఫోన్ కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు.

రెడ్ ప్లాన్ల డేటాలో మార్పులు

రెడ్ ప్లాన్ల డేటాలో మార్పులు

వొడాఫోన్ రూ.399, రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ డేటా పరిమితిని పెంచింది. రూ.399 రెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లో ఇప్పటి వరకు 20 జీబీ డేటా ఇవ్వగా, దీన్ని 40జీబీకి పెంచారు.

రూ.499 రెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌లో..

రూ.499 రెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌లో..

అలాగే రూ.499 రెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌లో ఇప్పటి వరకు 40 జీబీ డేటాను నెల నెలా అందిస్తూ వచ్చారు. దీన్ని ప్రస్తుతం 75 జీబీకి పెంచారు. ఇక ఈ రెండు ప్లాన్లలోనూ కస్టమర్లకు కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు యథావిధిగా లభిస్తాయి.

200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సదుపాయం

200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సదుపాయం

దీంతోపాటు 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సదుపాయం, అమెజాన్ ప్రైమ్ ఉచిత సభ్యత్వం, డివైస్ ప్రొటెక్షన్, రూ.499 కూపన్లు తదితర ఆఫర్లు ఈ ప్లాన్లతో లభిస్తున్నాయి.

ఐడియా-వొడాఫోన్‌ విలీనం

ఐడియా-వొడాఫోన్‌ విలీనం

ఇదిలా ఉంటే ఐడియా-వొడాఫోన్‌ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్‌ ఇండియా వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది.

విలీనానికి ముందే..

విలీనానికి ముందే..

దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం.

వొడాఫోన్‌ ఇండియా

వొడాఫోన్‌ ఇండియా

2015లో వొడాఫోన్‌ తన సబ్సిడరీలైన వొడాఫోన్‌ ఈస్ట్, వొడాఫోన్‌ సౌత్, వొడాఫోన్‌ సెల్యులర్, వొడాఫోన్‌ డిజిలింక్‌లను వొడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌లో విలీనం చేసింది.ఇదే ఇప్పుడు వొడాఫోన్‌ ఇండియాగా మారింది.

విలీనం సమయంలోనే..

విలీనం సమయంలోనే..

విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్‌ నోటీసు చేయడంతో వొడాఫోన్‌ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్‌ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది.

బకాయిలపై టెలికం శాఖ

బకాయిలపై టెలికం శాఖ

దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్‌ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్‌ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు.

Best Mobiles in India

English summary
vodafone-gives-one-year-free-amazon-prime-membership-with-its-red-post-paid-plans More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X