వన్ ఇండియా పాఠకుల కోసం ఆన్‌లైన్‌లో ఆడియో పుస్తకాలు

Posted By: Super

వన్ ఇండియా పాఠకుల కోసం ఆన్‌లైన్‌లో ఆడియో పుస్తకాలు

సెల్‌ఫోన్‌ ద్వారా పాటలో, రేడియో ప్రసారాలో వినడమే కాదు పుస్తకాలను కూడా చక్కగా చెవిలో చదివించుకోవచ్చు. ఎందుకంటే ఆడియో రూపంలో పుస్తకాలు వచ్చేశాయి. ఎంపీ3 ఫార్మెట్‌లో ఐపాడ్‌, సెల్‌ఫోన్‌ల్లోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు పుస్తకాల్ని వినొచ్చు. పిల్లల కథల దగ్గర్నుంచి షేక్‌స్పీయర్‌ రచనల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినడం ద్వారా భాష ఉచ్చారణ కూడా మెరుగుపడుతుంది.

ఇవన్నీ ఉచితంగా!
చరిత్ర, సైన్స్‌, ఫిక్షన్‌, కామెడీ, మిస్టరీ, కవితలు, షార్ట్‌స్టోరీలు... ఇలా మీకు ఇష్టమైన వివిధ రకాల ఆడియో పుస్తకాల్ని అందిస్తున్న సైట్‌లు చాలానే ఉన్నాయి. ఉచితంగా అందిస్తున్నవి మాత్రం కొన్నే. వాటిల్లో www.booksshouldbefree.com ఒకటి. నచ్చిన పుస్తకంపై క్లిక్‌ చేసి ఎంపీ3 ఫార్మెట్‌ను సెలెక్ట్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పుస్తకం పేరు, రచయిత, ఆడియో ప్రివ్యూలను కూడా చూడొచ్చు. ఏదైనా పుస్తకంపై క్లిక్‌ చేస్తే iPod download, Mp3download లింక్‌లు కనిపిస్తాయి. సిస్టం, సెల్‌ఫోన్‌లో పుస్తకాల్ని వినాలంటే ఎంపీ3 డౌన్‌లోడ్‌ను క్లిక్‌ చేయండి.

మరికొన్ని వరుసగా... www.newfiction.com, www.thoughtaudio. com, http://librivox.org, www.podiobooks.com, www.learnou tloud.com, www.openculture.com

పిల్లలకు ప్రత్యేకం
ఇంగ్లీష్‌లో ఆకట్టుకునే కథల్ని వినాలనుకుంటే http://storynory.comలోకి వెళ్లండి. ఏదైనా పుస్తకంపై క్లిక్‌ చేయగానే టెక్ట్స్‌ రూపంలో కథ కనిపిస్తుంది. ఆడియో వింటూ చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ అక్కర్లేదనుకుంటే పేజీలోని స్పీకర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌లోనే వినొచ్చు. అలాంటి సైట్‌లు కొన్ని... http://lightupyourbrain.com, http://kayray.org/audiobooks/

ఇక్కడ కొనొచ్చు
మన దేశంలోని ప్రముఖ రచయితలు రాసిన ఆడియో పుస్తకాల్ని కొనుగోలు చేసి వినాలంటే http://audiobookindia.comలోకి వెళ్లండి. వివిధ పుస్తకాల ముఖచిత్రాలు, టైటిల్‌, ధర... లాంటి వివరాలు కనిపిస్తాయి. స్పీకర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి నమూనా ఆడియో వినొచ్చు. www.asiabookroom. హిందీ ఆడియో పుస్తకాలకు www.audiohindi.comలోకి వెళ్లండి. సభ్యులై పుస్తకాల్ని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot