టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

|

ఈ రోజుల్లో చదువు అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం. మంచి చదువులు చదివి గుడ్ జాబ్ కొట్టాలని అందరూ ఆశపడుతుంటారు. ముఖ్యంగా లక్షల జీతాలు అందించే సాఫ్ట్ వేర్ జాబులు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకోసం సాప్ట్ వేర్ కి సంబంధించి అన్ని రకాల కోర్సులను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ కోర్సులు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఏం చేయాలో తోచదు. అలాంటి వారి కోసం ఆన్ లోన్లో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

 

అదీగాక వాటిల్లో ఉచితంగా లభిస్తున్నాయి. మరి విద్యార్ధులకు అందుబాటులో ఉన్న కోర్సు వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేయండి.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Codeacademy

ఈ వెబ్ సైట్ మొత్తం 12 రకాల భాషల్లో కోడింగ్ లాంగ్వేజిని నేర్పిస్తోంది. Python, Ruby, Java, JavaScript, jQuery, React.js, AngularJS, HTML, Sass and CSS వంటి కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. ఈ వెబ్ లోకి లాగిన్ అయితే మీకు అనేక రకాల గైడెన్స్ లభిస్తాయి. ఇందులో బేసిక్ కోర్సు ఉచితం. ప్రాజెక్ట్ వంటి వాటిల్లోకి వెళ్లాలంటే నెలకు 19.99 డాలర్లు చెల్లించాలి.

Dash General Assembly

ఇదొక ప్రాఫిట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజింగ్ సంస్థ. అయినప్పటికీ ఈ సంస్థ విద్యార్థుల కోసం కొన్ని రకాల కోర్సులను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. HTML, CSS and JavaScript వంటి వాటిని విద్యార్థులకు అందిస్తోంది.

 

 

EdX
 

EdX

ఇదొక massive open online course (MOOC). ఈ సంస్థ యూనివర్సిటీ లెవల్ కోర్సులు అందుబాటులో ఉంచింది. schools, nonprofit organizations and corporations స్థాయిలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. షార్ట్ వీడియోస్, interactive learning exercises, tutorial videos, online textbooks వంటివి అందుబాటులో ఉన్నాయి.

Harvard Online Learning

ఈ సంస్థ course materials, lectures, programs and other educational contentని విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తోంది. EdX, GetSmarter, HarvardX, Harvard Business School (HBX), Harvard Extension School and Harvard Medical School (HMX)సంస్థల సహాయంతో మెటిరీయల్ ను అందిస్తోంది.

Khan Academy

ఇదొక నాన్ ఫ్రాపిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ. 2006లో స్థాపించారు. చదువుకుని బయటకు వచ్చిన విద్యార్థుల కోసం ఈ సంస్థ ఉచితంగా మెటీరియల్ ని అందిస్తోంది. వివిధ రకాల భాషల్లో దాదాపు 20 వేల subtitle translations అందుబాటులో ఉన్నాయి.

Lynda.com from LinkedIn

1995లో Lynda Weinman దీన్ని స్థాపించారు. దీన్ని లింక్డ్ ఇన్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కూడా విద్యార్థుల కోసం అన్ని రకాల మెటీరియల్స్ ని ఆన్ లైనలో అందుబాటులో ఉంచింది.

MIT OpenCourseWare

MIT యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇది. విద్యార్థుల కోసం ఉచిత మెటీరియల్స్ ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.

Udemy

ఇందులో ప్రొఫెషనల్స్ అందించే మెటీరియల్స్ లభిస్తాయి. కొన్ని కోర్సులు ఉచితంగా లభిస్తాయి.మరికొన్ని కోర్సులకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
8 free online course sites for growing your tech skills

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more