ఆంధ్రా, కర్ణాటక సర్కిళ్లకు ‘సిమ్‌పాజిబుల్’ మొబైల్ సర్వీసులు

Posted By:

నెలానెలా అధిక మొత్తంలో మొబైల్ బిల్లులను చేస్తున్న వినియోగదారులకు శుభవార్త. మీ కోసం ‘సిమ్‌పాజిబుల్'(simpossible) పేరుతో కొత్త మొబైల్ సర్వీస్ అందుబాటులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటకా సర్కిళ్లలోని మొబైల్ యూజర్లు ‘సిమ్‌పాజిబుల్' మొబైల్ సర్వీస్‌ను ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ ద్వారా పొందవచ్చు.

ఈ సర్వీస్‌ను పొందాలనుకుంటున్న వారు ముందుగా simpossible.inలోకి లాగినై తమ వివరాలను నమోదు చేసుకోవల్సి ఉంటుంది. మీ వివరాలు నమోదైన వెంటనే మీ పోస్టల్ అడ్రెస్‌కు ఉచిత సిమ్‌ను పంపించటం జరుగుతుంది. నామినల్ ఛార్జ్ క్రింద రూ.35ను వసూలు చేస్తారు. అదే సమయంలో సిమ్‌పాజిబుల్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదించి మీ నుంచి ఫోటోతో పాటు ఇతర డాక్యుమెంట్‌లను సేకరించటం జరుగుతుంది.

ఆంధ్రా, కర్ణాటక సర్కిళ్లకు ‘సిమ్‌పాజిబుల్’ మొబైల్ సర్వీసులు

ఎయిర్‌సెల్ స్టోర్‌లలోనూ సిమ్ పాజిబుల్ సిమ్‌లు లభ్యమవుతున్నాయి. సిమ్‌పాజిబుల్ సేవలను వినియోగించుకోవాలనుకునే ఎయిర్‌సెల్ వినియోగదారులు కేవలం 4 గంటల వ్యవధిలోని కనెక్షన్ పొందవచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot