సంచలనం రేపిన ఫ్రీడం 251 ఫోన్లపై మరో కీలక ప్రకటన..

Written By:

ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ కంపెనీ గతేడాది ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇది ఓ పెద్ద సంచలనం అయింది కూడా. అయితే అవి బయటకు రాక పోవడంతో చాలామంది నిరుత్సహానికి గురి అయి కంపెనీని అధినేతను దుమ్మెత్తి పోశారు. అయితే ఇప్పుడు దాని అధినేత మోహిత్ గోయల్ మరో ప్రకటన చేశారు.

షియోమి రూ. 500 కోట్ల బహుమతులు, ఆ ఫోన్‌పై మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్లపై మరో కీలక ప్రకటన

రింగింగ్ బెల్స్ అధినేత మోహిత్ గోయల్ ఫ్రీడం 251 ఫోన్లపై మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం సహకారం అందిస్తే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి ఈ హ్యాండ్‌సెట్లను ప్రజలకు అందజేస్తానని చెబుతున్నారు.

సమయానికి ఫోన్లు అందించని కారణంగా..

కాగా రింగింగ్ బెల్స్ కంపెనీకి ఫోన్లు అందిస్తానని సొమ్ము తీసుకుని సమయానికి ఫోన్లు అందించని కారణంగా ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన వికాశ్‌ శర్మ, జీతూను పోలీసులు అరెస్ట్ చేసి దస్నా జైలుకు తరలించారు.

ఆరు నెలలు జైల్లో..

వారి అరెస్ట్‌ నేపథ్యంలో ఓ న్యూస్‌ ఏజెన్సీతో మోహిత్‌ మాట్లాడుతూ ‘వారి ఇద్దరికీ సుమారు రూ.3.5కోట్లు చెల్లించాను. వారు ఫోన్లు అందజేయాల్సి ఉన్నా, ఇవ్వకుండా మోసం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు సరఫరా చేయని కారణంగా నాపై కేసు వేశారు. దీంతో నేను ఆరు నెలలు జైల్లో గడపాల్సి వచ్చిందన్నారు.

మేకిన్‌ ఇండియా' నినాదానికి కట్టుబడి ఉన్నా

నేను ఎందుకు ఫోన్‌ను అందించలేకపోయానో అనే విషయం ప్రజలు తెలుసుకుంటారని, తాను ఇప్పటికీ ‘మేకిన్‌ ఇండియా' నినాదానికి కట్టుబడి ఉన్నానని మోహిత్‌ చెబుతున్నారు.ప్రభుత్వం సహకారం అందిస్తే ఫోన్‌ను ఇస్తానని తెలిపారు.

నా మోడల్‌ను అనుకరించి..

నా మోడల్‌ను అనుకరించి కార్బన్‌ వంటి కంపెనీలతో కలిసి రూ.1300కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. జియో సైతం రూ.1500కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. అంత తక్కువ ధరకు వారెలా అందిస్తున్నారని ప్రజలు ఎందుకు అడగడం లేదు?' అని ఆయన ప్రశ్నించారు.

సుమారు 7కోట్ల మంది..

గతేడాది ఫిబ్రవరిలో 25 లక్షల స్మార్ట్‌ఫోన్లను రూ.251కే అందిస్తామని రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 7కోట్ల మంది ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో సైట్‌ కూడా క్రాష్‌ అయ్యింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది.

5వేల స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసిన కంపెనీ ..

ఆ తర్వాత 5వేల స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసిన కంపెనీ చేతులెత్తేసింది. అయితే, తమ వద్ద రూ.16లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫిర్యాదు చేయడంతో మోహిత్‌ను ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకి వచ్చారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Freedom 251 maker resurfaces, still upbeat on delivering handsets Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot