ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

By Sivanjaneyulu
|

'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న 30,000 మందికి డబ్బు వాపసు చేసినట్లు రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. మరింత పారదర్శకంగా వ్యవహరించేందేకు ఫోన్ డెలివరీ చేసిన తరువాతే, వారి వద్ద నుంచి డబ్బు తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

10 రోజుల క్రితం ఏం జరిగింది..?

రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఫ్రీడమ్ 251 పేరుతో ఆవిష్కరించబడిన ఈ మేక్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిని కనబరిచారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు అడుగడుగుగా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆది నుంచి ఫ్రీడమ్ 251 వెబ్‌సైట్ మెరాయిస్తుండటంతో నెటిజనులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Read More : నోకియా, బ్లాక్‌బెర్రీలతో వాట్సాప్ తెగతెంపులు..?

ఇన్ని అవాంతరాలు ఎదరైనప్పటికి ఫ్రీడమ్ 251 ఫోన్‌లకు సంబంధించి తాము 6 కోట్ల రిజిస్ట్రేషన్లు పొందామని రింగింగ్ బెల్స్ చెప్పుకొచ్చింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు జరగటం విశ్లేషకులను సైతం కలవరపరుస్తోంది. ఒక్కో మెయిల్ ఐడీ పై ఒక ఫోన్‌ను మాత్రమే బుక్ చేసుకునేలా రింగింగ్ బిల్స్ నిబంధనను సెట్ చేసినప్పటికి ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడమనేది ఆసక్తికర చర్చకు దారి తీసింది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఈ అతితక్కువ ఖరీధైన ఫోన్ కోసం 250 రూపాయిలు ఖర్చుపెడితే వచ్చే నష్టమేంటి.. పోతే 250 రూపాయిలు, వస్తే ఓ స్మార్ట్‌ఫోన్ అని ఫిక్స్ అయి యువత ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎగబడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

మొదటి ఫేజ్‌లో 25 లక్షల ఫోన్ల వరకే అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ తమ అంచనాలు మించి డిమాండ్ రావటంతో బుకింగ్ ప్రక్రియను ఇంతటితో నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన డెలివరీ ప్రక్రియను ఏప్రిల్ 10 నుంచి ప్రారంభంచి జూన్ 30లోపు పూర్తి చేస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ అధ్యక్షుడు అశోక్ చద్దా ఆశాభావం వ్యక్తం చేసారు.

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈ ఫోన్‌లు డెలివరీ చేయబడతాయని చద్దా IANSకు తెలిపారు.

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

ఫ్రీడమ్ 251, డబ్బులు వెనక్కి

రింగింగ్ బెల్స్ సంస్థ అందిస్తోన్న రూ.251 స్మార్ట్‌ఫోన్ పథకం పై విచరాణ జరపాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అరుణా శర్మను టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు

Best Mobiles in India

English summary
Freedom 251 makers refund pre-booking money, what next?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X