ఊరించి.. ఉసూరుమనిపించిన రూ.251 స్మార్ట్‌ఫోన్

Written By:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.251 స్మార్ట్‌ఫోన్ 'ఫ్రీడమ్ 251'నెటిజనులను ఊరించి ఉసూరుమనిపించింది. ఈ ఫోన్ కోసం రాత్రి నుంచి ఎదురుచూస్తున్న వారికి చేదు అనుభవమే మిగిలింది. బుకింగ్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే సైట్ క్రాష్ అవటంతో ఇందులో ఏదో మతలబు ఉందన్న దుమారం చెలరేగుతోంది.

ఊరించి.. ఉసూరుమనిపించిన రూ.251 స్మార్ట్‌ఫోన్

తమ ఫ్రీడమ్ 251 ఫోన్‌కు గత కొన్ని రోజులుగా విస్తృతం ప్రచారం కల్పిస్తూ వస్తున్న రింగింగ్ బెల్స్, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని www.freedom251.comకు ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను తట్టుకునే ఏర్పాట్లే చెయ్యలేక పోవటం విడ్డూరంగా ఉంది.

Read more: లీ 1ఎస్ రికార్డ్ సేల్, 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు

4 అంగుళాల టచ్ స్ర్కీన్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3.2 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 3జీ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఇంకా 1,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇన్ని ఫీచర్లున్న రూ.251కే ఇస్తామని రింగింగ్ బెల్స్ చెప్పటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుందన్న సంతోషం వ్యక్తమైంది. ప్రస్తుత పరిణమాలను చూస్తేంటే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలిచేటట్లు కనిపించటం లేదు. రూ.1500కే సాధ్యపడని ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌ ను రూ.251కే ఇస్తామని రింగింగ్ బెల్స్ తమ సొంత వెబ్‌సైట్‌లో చెప్పుకుంటూ వచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

రింగింగ్‌ బెల్స్‌ విడుదల చేసిన చౌక స్మార్ట్‌ఫోన్‌పై మొబైల్‌ పరిశ్రమలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రీడమ్‌ 251 మొబైల్‌ను రూ.251కే విక్రయించడంపై లోతుగా సమీక్షించాలని ఐసిఎ (భారత సెల్యులార్‌ అసోసియేషన్‌) కేంద్ర ఐటి మంత్రికి లేఖ రాసింది.

English summary
Freedom 251 Official Website Crashed and its Down. Read More in Telugu Gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting