రూ. 251 మొబైల్ కంపెనీపై చీటింగ్ కేసు

Written By:

రూ. 251కే మొబైల్‌ని అందిస్తామని చెప్పి సంచంలనం రేపిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రింగింగ్ బెల్ కంపెనీ సై ఫ్యూచర్స్ సంస్థ‌తో చేసుకున్న ఒప్పందంపై ఆ కంపెనీ మాట తప తప్పిందని సై ఫ్యూచర్స్ కంపెనీ వాదిస్తోంది. మాచేత పని చేయించుకుని ఒక్క రూపాయి కూడా మాకు అప్పజెప్పలేదని కంపెనీ వాదిస్తోంది. ఇదిలా ఉంటే టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఈ కంపెనీపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more: రూ. 251తో మేక్ ఇన్ ఇండియా కల చెదిరిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘సైఫ్యూచర్' సంస్థ రింగింగ్ బెల్స్ కంపెనీపై చీటింగ్ కేసు పెట్టే యోచనలో

కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటించి కొన్ని కోట్ల విలువైన పబ్లిసిటీని ఉచితంగా పొందిన రింగింగ్ బెల్స్ కంపెనీ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకుంది. ‘సైఫ్యూచర్' సంస్థ రింగింగ్ బెల్స్ కంపెనీపై చీటింగ్ కేసు పెట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..

సైఫ్యూచర్ సంస్థ డేటా, బీపీవో సర్వీసులను

సైఫ్యూచర్ సంస్థ డేటా, బీపీవో సర్వీసులను అందిస్తుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు సంబంధించి భారత్‌లో కాల్ సెంటర్ సేవలను అందించడానికి సైఫ్యూచర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

రింగింగ్ బెల్స్ కంపెనీ తమకు చెల్లించాల్సిన డబ్బుల్ని

రింగింగ్ బెల్స్ కంపెనీ తమకు చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించడం లేదని, ఇదేంటని అడిగితే సేవలు బాగోనందున, కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు రింగింగ్ బెల్స్ తెలిపిందని సైఫ్యూచర్ సంస్థ సీఈవో అనుజ్ బైరథి తెలిపారు.

అయితే తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం

అయితే తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇలా ఏడాదిలోపు , ఎటువంటి నోటీసూ లేకుండా అర్థాంతర కాంట్రాక్టు రద్దు కుదరదని పేర్కొన్నారు.

తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి

ఇదిలా ఉంటే రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందించడంలో విఫలమైతే.. అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251’ ఉదంతాన్ని

కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251' ఉదంతాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడవ్ 251' స్మార్ట్‌ఫోన్‌ను ఎలా తయారు చేస్తుంది? రూ.251లకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా? బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా? లేదా? వంటి తదితర అంశాలపై తమ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోందని వివరించారు.

ఆదాయపు పన్ను శాఖ కూడా

ఆదాయపు పన్ను శాఖ కూడా రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తోంది. ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ విభాగం కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎక్సైజ్ ,ఐటీ, విభాగం అధికారులు

ఎక్సైజ్ ,ఐటీ, విభాగం అధికారులు వచ్చిన సంగతి వాస్తవమేనని వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా తెలిపారు.

ఈ అతి చౌక స్మార్ట్ ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ

మరో వైపు ఈ అతి చౌక స్మార్ట్ ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్ ,ఐటీ విభాగం కార్యదర్శి అరుణ శర్మని టెలికాం శాఖా మంత్రి రవిశంకర్ ఆదేశించారు.

రోజు రోజుకు ముదురుతున్న సమస్యల మధ్య

మరి రోజు రోజుకు ముదురుతున్న సమస్యల మధ్య రింగింగ్ బెల్స్ కంపెనీ తన రూ.251 మొబైల్ ని ఎలా ముందుకు తీసుకువస్తుందనేది సస్పెన్స్ గా మారింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ

గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Freedom 251: Call-centre alleges fraud by Ringing Bells; company denies charge
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot