ఫ్రీడం 651: సర్వీసింగ్ మార్స్ మీదనే

Written By:

రూ. 251 ఫోన్‌పై ఆన్‌లైన్‌లో కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. అదే పేరును కాస్త అటు ఇటుగా మార్చి సరికొత్త వెబ్‌సైట్ ను తయారుచేశారు. రూ. 251 వైబ్‌సైట్‌ను కామెంట్ చేస్తూ వచ్చిన ఆ కొత్త వెబ్‌సైట్‌ పేరు ఏంటో తెలుసా... ఫ్రీడమ్ 651. డాట్ కాం. సేమ్ టూ సేమ్ అచ్చు గుద్దినట్లు అదే ప్రీడం 251 వెబ్ సైట్ లాగానే అది కూడా ఉంది. కాకపోతే దానిలో చాలా ఫన్నీ ఫన్నీ విషయాలు ఉన్నాయి. ఆ సైట్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఫ్రీడమ్ 251.. 6 కోట్ల రిజిస్ట్రేషన్లు?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రింగింగ్ బెల్స్ సంస్థను ఎద్దేవా చేస్తూ ఒక కొత్త వెబ్‌సైట్

251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థను ఎద్దేవా చేస్తూ ఒక కొత్త వెబ్‌సైట్ వచ్చింది. దాని పేరు ఫ్రీడమ్651.కామ్.

అచ్చం ఫ్రీడమ్ 251 సైట్‌లాగే

అచ్చం ఫ్రీడమ్ 251 సైట్‌లాగే తమది కూడా రూపొందించి, దాంట్లో 'డజ్‌నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్) అని పేర్కొన్నారు. అచ్చు గుద్దినట్లు దానిలాగానే ఈ సైట్ కూడా ఉంది.

2 కోట్ల రాకెట్లు చేసి, మనుషులను వాటికి కట్టి

తాము శివకాశిలోని స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2 కోట్ల రాకెట్లు చేసి, మనుషులను వాటికి కట్టి అంగారక గ్రహం మీదకు పంపుతామని, అందుకోసం కేవలం 650 రూపాయలు కడితే సరిపోతుందని చెప్పారు.

బయ్ నౌ' అనే బటన్ ఉండే ప్రదేశంలో.. 'డునాట్ బై'

ఇక 'బయ్ నౌ' అనే బటన్ ఉండే ప్రదేశంలో.. 'డునాట్ బై' అనే బటన్ పెట్టారు. 2026 జూన్ 30వ తేదీన డెలివరీ ఇస్తామని చెప్పారు.

మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ కస్టమర్ కేర్ నంబర్‌కు

మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి కనుక్కొవచ్చని నంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ 0420-420420, 4200420 గా పేర్కొన్నారు.

కాంటాక్ట్ అజ్ అనే విభాగంలో అయితే

ఇక కాంటాక్ట్ అజ్ అనే విభాగంలో అయితే యూజర్ తాత వివరాలు, పొరుగింటివారి వివరాలు అడిగి, అప్పుడు కూడా ఫామ్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నించొద్దన్న హెచ్చరికను ఉంచారు.

తమకు స్మార్ట్ ఫోన్ తయారుచేయాలన్న ఆలోచన

తమకు స్మార్ట్ ఫోన్ తయారుచేయాలన్న ఆలోచన ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. ఇక మీ ఫోన్ సర్వీసింగ్ చేసుకోవాలంటే మార్స్ మీదకే వెళ్లాలి అని కూడా అక్కడ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ లో రాశారు.

ఈ స్మార్ట్ ఫోన్లను 40 ఏళ్ల తర్వాత

ఈ స్మార్ట్ ఫోన్లను 40 ఏళ్ల తర్వాత డ్రోన్లతో డెలివరీ చేస్తామని అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందేనని సరదాగా పేర్కొన్నారు.

చివరలో ఇది నవ్వుకోడానికే

చివరలో ఇది నవ్వుకోడానికే అనే అప్సన్ ఇచ్చి వదిలేశారు. వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Freedom 651 a parody site that doesnt ring a bell
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot