స్నేహితులకు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, మీ కోసమే ఈ స్టోరీ
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా.." అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిది. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను పంచే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా… స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు.

అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ప్రతి యేడాది ఆగస్టు నెల తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజునస్నేహితులకు మరచిపోలేని గిప్ట్ ఇచ్చి అందర్నీ కలుసుకుంటుంటారు. మరి మరచిపోలేని బహుమతులు మార్కెట్లో ఏమున్నాయంటే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ గిప్ట్ లను ఈ శీర్షికలో అందస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Honor Band 4
దీని ధర రూ. 2,599
ఇందులో 0.95 ఇంచుల అమోలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనిపై హోమ్ బటన్‌ను అమర్చారు. ఈ బ్యాండ్‌కు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇందులో హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంది. బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ టెక్నాలజీ ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఈ బ్యాండ్ యాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. పెడోమీటర్, స్లీప్ ట్రాకర్, ఎక్సర్‌సైజ్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్ తదితర ఫీచర్లను కూడా ఈ బ్యాండ్‌లో అందిస్తున్నారు. ఇక ఈ బ్యాండ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే కాల్స్, మెసేజ్‌ల నోటిఫికేషన్లను పొందవచ్చు. కార్డ్‌లెస్ పేమెంట్స్ కోసం ఈ బ్యాండ్‌లో ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. 100 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ బ్యాండ్‌లో ఉంది. దీని వల్ల బ్యాండ్‌ను 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

Best Price of Huami Amazfit Band 2
దీని ధర రూ. 3, 999
హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ, స్లీప్ ట్రాకింగ్, Calories burnt, మల్టి స్పోర్ట్స్ ట్రాకింగ్, Upto 50m water resistant, మ్యూజిక్ కంట్రోల్, LCD Display, వాటర్ రిసిస్టెంట్

Mi Band 3
దీని ధర రూ. 1,999
ఇందులో 0.78 ఇంచ్ ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు ఈ బ్యాండ్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 3 రోజుల వాతావరణ సమాచారం తెరపై కనిపిస్తుంది. అలాగే కాలింగ్ చేసే వారి నంబర్, పేరు నోటిఫికేషన్ రూపంలో తెరపై కనిపిస్తాయి. ఈ బ్యాండ్ 5ఏటీఎం వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంది. అందువల్ల 50 మీటర్ల లోతులో నీటిలో ఉన్నప్పటికీ ఈ బ్యాండ్ చక్కగా పనిచేస్తుంది.షియోమీ ఎంఐ బ్యాండ్ 3 లో యాక్టివిటీ ట్రాకర్ ఉంది. దీంతో రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్ తదితర యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. ఈ బ్యాండ్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను కూడా రిజెక్ట్ చేయవచ్చు. ఇందులో 110 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనివల్ల బ్యాండ్ 20 రోజుల బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఎంఐ ఫిట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.

Infinix Xband 3
దీని ధర రూ. 1,599
ఇందులో 0.96 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 160 x 80 పిక్సల్స్ రిజల్యూషన్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఓఐఎస్ డివైస్‌లకు ఈ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, క్యాలరీ కౌంటర్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్, సెడెంటరీ రిమైండర్, మ్యూజిక్ కంట్రోల్, హార్ట్ రేట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ బ్యాండ్‌లో 90 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ బ్యాండ్ 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

iVooMi FitMe Smart Fitness Band
దీని ధర 1,649
ఇందులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల యూజర్ చుట్టూ ఉన్న పరిసరాల్లోని గాలి నాణ్యత ఏ విధంగా ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ బ్యాండ్ ద్వారా వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు వీలు కల్పించారు. ఇందులో ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 0.87 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, పెడోమీటర్, బ్లూటూత్ 4.2, 90 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు డివైస్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

Fitbit Inspire HR
దీని ధర రూ.7,966
ఫిట్‌బిట్ ఇన్‌స్పైర్ హెచ్ఆర్ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో హార్ట్ రేట్ సెన్సార్, జీపీఎస్, 15 రకాలకు పైగా గోల్ బేస్డ్ ఎక్సర్‌సైజ్ మోడ్స్, స్లీప్ ట్రాకర్, 5 రోజుల బ్యాటరీ లైఫ్, జీపీఎస్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్, ఎస్‌పీవో2 సెన్సార్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








