Friendship Day 2020: మీ ఫ్రెండ్ కి గిఫ్టు గా ఇవ్వడానికి బెస్ట్ ఛాయస్ ఇవే!
స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా... స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు.అంతటి ఉన్నతమైన విశిష్టతను కలిగి ఉన్న స్నేహబంధాన్ని సగర్వంగా చాటిచెప్పేందుకు ఏర్పాటైన రోజే 'ఫ్రెండ్‌షిప్ డే'.

నేడు స్నేహితుల రోజును పురస్కరించుకుని మీ స్నేహితుని కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ బ్యాండ్ లను ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లుగా గిఫ్ట్ లు ఇవ్వండి. బడ్జెట్ ధరలలో ని బెస్ట్ స్మార్ట్ బ్యాండ్ ల ఎంపికను మీకందిస్తున్నాము.

Xiaomi Mi Band 3
జాబితాలో మొదటిది షియోమి మి బ్యాండ్ 3, ఇది పూర్తి గా టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది, 50 మీటర్ల వరకు నీటిలో నిరోధకత కలిగి ఉంటుంది మరియు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్కమింగ్ కాల్స్ మరియు ఇతర నోటిఫికేషన్లు అన్నీచూసుకోవడానికి వీలుంటుంది. ఇది ధర రూ. 1,999.వద్ద లభిస్తుంది.

Noise ColorFIT 2
నాయిస్ కలర్ ఫిట్ 2 మీ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చే ఆలోచనగా మరొక ఖచ్చితమైన ఎంపిక. ఫిట్‌నెస్ బ్యాండ్ రూ. 1,983 మరియు స్టెప్ కౌంటర్, హృదయ స్పందన సెన్సార్, కేలరీలు బర్న్ కౌంట్, వంటి ఫిట్నెస్ ట్రాకింగ్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లు దీనిలోని ముఖ్యమైన లక్షణాలు.

Xiaomi Mi Band HRX Edition
ఎడిషన్ షియోమి మి బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్ ఈ ఫ్రెండ్షిప్ డే యొక్క బహుమతి కి గొప్ప ఆలోచన. ప్రత్యేక ఎడిషన్‌గా ఇది రూ. 1,299.వద్ద లభిస్తుంది. ఇది మెరుగైన ట్రాకింగ్ అల్గోరిథంతో వస్తుంది, ఇది మీ ఫ్రెండ్ కి సరైన బహుమతి ఎంపిక.

Honor Band 5i
ఈ జాబితాలో చేర్చడం హానర్ బ్యాండ్ 5i కి అన్నీ అర్హతలు ఉన్నాయి , ఇది రూ. 1,799. ఫిట్నెస్ బ్యాండ్ వివిధ రంగులలో లభిస్తుంది, వీటిలో కోరల్ పింక్, మెటోరైట్ బ్లాక్ మరియు ఆలివ్ గ్రీన్ ఉన్నాయి, వీటిని ఎంచుకోవడానికి మీకు చాలా ఆప్షన్ లు లభిస్తాయి.

Honor Band 4
అదే బ్రాండ్ నుండి మరో ఫిట్‌నెస్ బ్యాండ్ ఉంది, అవి హానర్ బ్యాండ్ 4. ఇది కూడా మీ ఫ్రెండ్ కు బహుమతిగా ఇవ్వడానికి మంచి ఎంపిక అవుతుంది. రూ. 2,000 బ్రాకెట్ లో , హానర్ బ్యాండ్ 4 0.95-అంగుళాల AMOLED ప్యానెల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

Realme Band
ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో కొత్త గా వచ్చిన వాటిలో ఇది ప్రధానమైనది, కానీ ఫ్రెండ్ షిప్ డే కి ఈ బ్యాండ్ ఖచ్చితంగా ఉత్తమ బహుమతి ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. రియల్‌మే బ్యాండ్ టచ్ కీ, అంతర్నిర్మిత యుఎస్‌బి ఛార్జింగ్, రియల్ టైమ్ హృదయ స్పందన సెన్సార్లు మరియు మరిన్ని పూర్తి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది రూ. 1,499.ధర వద్ద మార్కెట్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications