ఎస్‌ సిరీస్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఫ్యూజీఫిల్మ్‌

Posted By: Staff

ఎస్‌ సిరీస్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఫ్యూజీఫిల్మ్‌

ఫ్యూజీ ఫిల్మ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నూతనంగా ఎస్‌ సిరీస్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 26 ఎక్స్‌ సూపర్‌జూమ్‌, హెచ్‌డీ మూ వీ రికార్డింగ్‌, సైమల్‌, షూట్‌ ఫంక్షన్‌లాంటివి దీని విశిష్టతలు. బ్లాక్‌ కలర్‌లో క్లాసీ లుక్స్‌తో ఉండే ఈ కెమెరా 24 ఎంఎం జూమ్‌ ఫంక్షన్‌ లెన్స్‌తో , 14.0 మెగా పిక్చెల్‌ రిజల్యూషన్‌ చిత్రాలను అందిస్తుంది.

హెచ్‌డీ పిక్చర్‌, మూవీ సామర్ధ్యాలు గల ఈ కెమెరా షార్ప్‌డిటేల్స్‌తో మరింత ప్రకా శవంతంగా, అసలైన రంగుల్లో అత్యున్నతస్థాయి నాణ్యత గల చిత్రాలను తీసేందుకు దోహదపడుతుంది. ఈ సంద ర్భంగా ఫ్యూజీ ఫిల్మ్‌ ఎండీ టనాకా మాట్లాడుతూ అత్యున్నతమైన సాంకేతికతను అందించడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ కెమెరాలో ఫాటో తీసే తీరు తేలిగ్గానే ఉంటుందన్నారు. ఫేస్‌ డిటెక్షన్‌, బ్లింట్‌ డిటెక్షన్‌, సైమల్‌ షూట్‌లాంటి ప్రత్యేకతలతో కూడిన ఈ కెమెరా అన్ని వర్గాలను ఆకర్షించగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting