మీ నాడి వేగాన్ని తెలిపే ఫోన్ కెమెరా!!

Posted By:

 మీ నాడి వేగాన్ని తెలిపే ఫోన్ కెమెరా!!
ఇక పై మీ నాడి వేగాన్ని తెలుసుకునేందుకు డాక్లర్ చెంతకు పరిగెత్తనవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో మీ ముఖాన్ని ఓ ఐదు సెకన్ల పాటు చిత్రీకరిస్తే చాలు.. మీ నాడి కొట్టుకునే వేగం ఇట్టే తెలిసిపోతుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన ఫుజిట్సూ (Fujitsu) ప్రయోగశాల పరిశోధకులు కెమెరా ఆధారంగా నాడి వేగాన్ని తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత ఆధారంగా ఒక్క స్మార్ట్‌ఫోన్‌తోనే కాకుండా కంప్యూటర్ వెబ్ క్యామ్ ఇంకా టీవీకి అమర్చిన కెమెరా ద్వారా నాడి వేగాన్ని తెలుసుకోవచ్చు.

ఎరుపు.. ఆకుపచ్చ ఇంకా నీలిరంగుల మిశ్రమమే కాంతి (లైట్). అయితే మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఆకుపచ్చరంగు కాంతిని సంగ్రహిస్తుంది. ఈ అంశాన్నే ఆధారంగా చేసుకుని పరిశోధకులు విజయం సాధించటం జరిగింది. కెమెరాతో ముఖాన్ని చిత్రీకరించినప్పుడు ఈ సాంకేతికత అక్కడి రంగులను పరిశీలిస్తుంది. అందులో ఆకుపచ్చ రంగు కాంతి ఆధారంగా.. రక్తప్రవాహాన్ని, నాడి కొట్టుకునే వేగాన్ని అంచనా వేస్తుంది.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot