త్వరలో పూర్తి స్థాయిలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ : ట్రాయ్

|

న్యూఢిల్లీ: మరో ఆరునెలల కాలవ్యవధిలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వ్యవస్థను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెలికామ్ రెగ్యులేటరీ ఆథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు కేవలం చందాదారు సర్వీసు ఏరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.

 త్వరలో పూర్తి స్థాయిలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ : ట్రాయ్

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే ఒక రాష్ట్రంలోని మొబైల్ వినయోగదారులు వేరొక రాష్ట్రంలోని మొబైల్ నెట్‌వర్క్‌లోకి అదే నెంబరుతో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ చేయించుకోవచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మొబైల్ యూజర్లు ప్రస్తుతం కొనసాగిస్తున్న మొబైల్ నెంబర్లతోనే కర్ణాటకా, తమిళనాడు, మహారాష్ట్రా తదితర రాష్ట్రాల్లోని మొబైల్
నెట్‌వర్క్‌లలోకి పోర్టబులిటీ చేయించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ప్రస్తుత మొబైల్ నెట్‌వర్క్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతో విసుగెత్తిస్తుందా..?, కొత్త నెట్‌వర్క్‌లోకి మారుదామనుకుంటున్నారా..?, అయితే, మీ ప్రస్తుత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు... ఇది ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, ట్రాయ్ గత ఏడాది అమలు చేసిన ‘మొబైల్ నంబర్ పోర్టబులిటి 'తో కొత్త నెట్‌వర్క్‌లోకి మారినా పాత్ మొబైల్ నెంబర్‌తోనే కమ్యూనికేషన్ బంధాలను కొనసాగించవచ్చు......

మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

ఈ కోడ్ ఆధారంగా మీరు మారాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేట్‌ర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను సమర్పించాల్సి ఉంది.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో భాగంగా మీ నుంచి 19రూపాయిలను వసూలు చేస్తారు. సిమ్ ఛార్జీలు అదనం. వారం రోజుల్లోపు మీ నెంబర్ కొత్త నెట్‌వర్క్‌లోకి యాక్టివేట్ అవుతుంది. పోర్టబులిటీ చేసుకోబోయే నెంబర్ తప్పనిసరిగా 90 రోజులకు మించి వాడకంలో ఉండాలనే నిబంధన ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X