ఇక iPhone యూజ‌ర్లు 10 రెట్లు మెరుగ్గా స్పామ్ కాల్స్‌ను ప‌ట్టేయ్యొచ్చు!

|

Truecaller యాప్ iPhone యూజ‌ర్ల కోసం చాలా కాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది ఆండ్రాయిడ్ వెర్షన్‌లాగా స్పష్టంగా లేదు. అయితే, తాజాగా ఈ Truecaller యాప్ iOS వినియోగదారులను ఆక‌ర్షించ‌డం కోసం సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్ష‌న్ చాలా సులువైన‌ది మరియు మునుపటి వెర్షన్‌తో పోల్చినప్పుడు 10 రెట్లు మెరుగైన స్పామ్, స్కామ్ మరియు బిజినెస్ కాల్ ఐడెంటిఫికేషన్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

 
ఇక iPhone యూజ‌ర్లు 10 రెట్లు మెరుగ్గా స్పామ్ కాల్స్‌ను ప‌ట్టేయ్యొచ్చు!

ఈ కొత్త వెర్ష‌న్ ద్వారా Truecaller యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేస్తూ అనేక అప్‌గ్రేడ్‌లతో పాటు, భద్రతకు అవ‌స‌ర‌మైన మెరుగైన ఫీచ‌ర్ల‌ను జోడించింది. అప్‌డేటెడ్ Truecaller యాప్ iPhone యూజ‌ర్ల‌కు వ‌చ్చే స్పామ్ కాల్స్‌, ఇబ్బందిక‌ర కాల్స్‌, ఇత‌ర స్కామ్‌లు గుర్తించ‌డంలో 10 రెట్లు మెరుగుపడిన‌ట్లు కంపెనీ పేర్కొంది. త‌ద్వారా ఐఫోన్ యూజ‌ర్లు ఇబ్బందికరమైన కాలర్‌లను నివారించడం చాలా సులభం అవుతుంది.

ఇక iPhone యూజ‌ర్లు 10 రెట్లు మెరుగ్గా స్పామ్ కాల్స్‌ను ప‌ట్టేయ్యొచ్చు!

iPhone వినియోగదారులు యాప్‌ను ఓపెన్ చేయ‌కుండానే నంబర్‌లను సెర్చ్ చేయడం కూడా సాధ్యమవుతుంది. iPhoneలలో, యాప్ ఇప్పుడు కాలర్ IDకి అదనంగా ఎమోజీలను కూడా చూపుతుంది. ఈ సంద‌ర్భంగా ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన అలాన్ మామెడి తాజా అప్‌డేట్ గురించి ప‌లు విష‌యాలు చర్చించారు. ఈ కొత్త Truecaller యాప్ అప్‌గ్రేడ్ Apple వినియోగదారులకు కాల్ అలర్ట్‌లు, కాల్ రీజన్ మరియు ప్రాక్టికల్ సెర్చ్ ఎక్స్‌టెన్షన్ వంటి మరింత శక్తివంతమైన ఫీచర్‌లను అందిస్తుంది. చాలా మంది iPhone వినియోగదారులు ఈ అప్‌డేట్ కోసం చాలా కాలంగా వేచి ఉన్నారని అలాన్ చెప్పారు. ఈ అప్‌డేట్ ద్వారా అత్యుత్త‌మంగా స్పామ్ మరియు స్కామ్ కాల్స్ గుర్తించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

10 రెట్లు మెరుగ్గా స్పామ్ గుర్తింపు:

10 రెట్లు మెరుగ్గా స్పామ్ గుర్తింపు:

కొత్త అప్‌డేట్ అందించే ప్రధాన మార్పులు ఏంటంటే.. స్పామ్ కాల్స్ నుండి రక్షణ ఇస్తుంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ తెలిపిన ప్ర‌కారం, రియ‌ల్‌టైంలో స్పామ్ కాల్‌లను ప‌ది రెట్లు మెరుగ్గా గుర్తిస్తుంది. ఏదైనా నంబర్ ను శోధించడానికి వినియోగదారులు కాల్ ముగిసే వ‌ర‌కు వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే Truecaller యాప్ రింగ్ అవుతున్నప్పుడు కూడా వారి వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల‌ను మెరుగైన వెరిఫికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను అందిస్తుంది.

గుర్తు తెలియ‌ని కాల‌ర్ల‌ను సులువుగా తెలుసుకోవ‌చ్చు:

గుర్తు తెలియ‌ని కాల‌ర్ల‌ను సులువుగా తెలుసుకోవ‌చ్చు:

కొత్త Truecaller యాప్ iPhone యూజ‌ర్ల‌కు వినియోగించ‌డానికి ఎంతో సుల‌భంగా ఉంటుంది. యూజ‌ర్లు ఎంతో సులువుగా యాప్‌లోకి లాగిన్ అయి అన్ని ఆప్ష‌న్ల‌ను వినియోగించుకోవ‌చ్చు. కొత్త Truecaller అప్‌డేట్‌ ద్వారా యాప్ ఓపెన్ చేయ‌కుండానే iPhone వినియోగదారులు నంబ‌ర్ల‌ను సెర్చ్ చేసే ప్రయోజనాన్ని పొందుతారు. మీకు ఏదైనా అన్‌నౌన్ నంబ‌ర్ నుంచి కాల్ వ‌చ్చిన‌ట్ల‌యితే.. మీరు మీ కాల్ లాగ్‌కి వెళ్లి, డిటైల్స్ బటన్‌ను నొక్కి ద్వారా Truecaller నుంచి వివ‌రాల‌ను క‌నుగొన‌వ‌చ్చు. తద్వారా ఆ కాలర్ పేరు బహిర్గతం చేయబడుతుంది. మీకు మళ్లీ అదే నంబర్ నుండి కాల్ వస్తే, ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారో ట్రూకాలర్ కాలర్ ID మీకు చూపుతుంది.

ట్రూకాల‌ర్‌ను ఐఫోన్‌లో సెట‌ప్ చేయడం ఎలా!
 

ట్రూకాల‌ర్‌ను ఐఫోన్‌లో సెట‌ప్ చేయడం ఎలా!

Apple యాప్ స్టోర్ నుండి iPhone లో Truecaller యొక్క తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్‌ ప్రాసెస్‌ను పూర్తి చేయండి. ఆ త‌ర్వాత సెట‌ప్ చేయ‌డం కోసం.. ముందుగా సెట్టింగ్‌లు > ఫోన్ > కాల్ బ్లాకింగ్ & ఐడెంటిఫికేషన్‌కి వెళ్లి, Truecaller పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మరియు పార్ట్ 4ని ఎనేబుల్ చేయండి. దీని తర్వాత, మీ iPhone స్పామ్, స్కామ్ మరియు బిజినెస్ కాల్‌లను గుర్తించడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా, కాల‌ర్ వివరాలను ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌పై నేరుగా ప్రదర్శిస్తుంది.

SMS ఫిల్టరింగ్, స్పామ్ డిటెక్షన్ మరియు రీడిజైన్ చేయబడిన నంబర్ లుక్-అప్ విడ్జెట్‌ల వంటి కమ్యూనిటీ ఆధారిత సేవలు మరియు మరిన్నింటిని రాబోయే రోజుల్లో జోడించబోతున్నట్లు Truecaller ధృవీకరించింది. ఏదేమైనప్ప‌టికీ, మీకు ఉత్తమమైన ట్రూకాలర్ అనుభవం కావాలంటే, మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగంతో మాత్ర‌మే ల‌భిస్తుంది.

Best Mobiles in India

English summary
Fully Functioning Truecaller For iPhone Is Here; Does It Really Match Android Version?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X