ఇంటర్నెట్‌ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలు

Posted By:

లండన్‌కు చెందిన ప్రముఖ ఐరిష్ కంపెనీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యులు లేదా ఆప్తుల అంతిమసంస్కారాలకు హాజరుకాలేని వారి కోసం తామున్నచోటునుంచే ఆ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించే అవకాశాన్ని ప్రముఖ కౌంటీ క్లేర్ వ్యాపారవేత్త అలెన్ ఫౌడీ, బయట దేశాల్లో నివశిస్తున్న ఐర్లాండ్ ఇంక యూకే ప్రాంత వాసులకు కల్పిస్తున్నారు. ప్రయివేటు వెబ్ లింక్ ద్వారా యూజర్‌కు రెండు గంటల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఫౌడీ బీబీసీ పత్రికకు తెలిపారు.

ఇంటర్నెట్‌ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలు

ఇంటర్నెట్ చిట్కా:

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లోని వివరాలు చూడొచ్చా..? సాధ్యమే అంటోంది జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్ తప్పని సరిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తన పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్స్ స్టాల్ చేసుకోవాలి. ఇన్స‌స్టాలేషన్ అనంతరం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి లాగినై జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసిన సదరు అప్లికేషన్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ పేజీలో నిక్షిప్తం కాబడి ఉంటుంది.

తదుపరి చర్యగా ఆ అప్లికేషన్ ను మీరు లాంఛ్ చేసిన వెంటేనే ‘Allow Offline Mail', ‘Dont allow offline mail' అనే రెండు ఆప్షన్‌లతో కూడిన వెబ్‌పేజీ ప్రత్యక్షమవుతుంది. ‘Allow Offline Mail'ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ స్టోర్ చేస్తుంది. మీరు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసిన ప్రతిసారీ ఇన్‌బాక్స్‌లోని వివరాలు ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లోకి చేరిపోతాయి. ప్రయాణ సందర్భాల్లో ఇంటర్నెట్ సాయంలేకుండానే ఆ వివరాలను మీరు తాపీగా చెక్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot