మనుగడ ప్రశ్నార్థకం, అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ !

దేశీయ టెలికాం రంగం నుంచి దాదాపు నిష్క్రమించే పరిస్థితిలో ఉన్న అనిల్ అంబాని రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు.

|

దేశీయ టెలికాం రంగం నుంచి దాదాపు నిష్క్రమించే పరిస్థితిలో ఉన్న అనిల్ అంబాని రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వేల కోట్ల అప్పులతో సతమతమవుతూ తన వ్యాపారాన్ని అన్నకు అప్పజెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్తులను అమ్ముకునేందుకు అనేక అడ్డంకులు ఎదురవతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనిల్ అంబానీ ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే నడిసంద్రంలో చిక్కుకుని బయటకు వచ్చే దారుల కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లుగా అనిల్ అంబానీకి డాట్ షాకిచ్చింది.

అనిల్ అంబానీకి మళ్లీ ఊహించని షాక్, దివాళా అంచున ఆర్‌కామ్, అన్న ఏమయ్యాడు ?అనిల్ అంబానీకి మళ్లీ ఊహించని షాక్, దివాళా అంచున ఆర్‌కామ్, అన్న ఏమయ్యాడు ?

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ..

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ..

అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నోటీసులు జారీ చేసింది.

774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే..

774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే..

రాబోయే స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో భాగంగా 774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ హెచ్చరించింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశించింది.

జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి..

జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి..

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి రుణాలు తీర్చుకోవాలని భావిస్తున్న అనిల్‌ అంబానీ కంపెనీకి, డీఓటీ ఈ నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.

అనుకోని పరిణామాలతో

అనుకోని పరిణామాలతో

ఈ అనుకోని పరిణామాలతో ప్రస్తుతం అంబానీ పరిస్థితి నడి సముద్రంలో చుక్కాని లేని నావలా మారిందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. గమ్యం ఎటో తెలియని పరిస్థితుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్ చిక్కుకుందని చెబుతున్నారు.

రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు

రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు

కాగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్‌లెస్‌ ఆస్తులను అన్న ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ జియోకు విక్రయిస్తోంది.

రూ.18వేల కోట్ల మేర ..

రూ.18వేల కోట్ల మేర ..

దీంతో రూ.18వేల కోట్ల మేర రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆర్జిస్తోంది.అయితే దాని అమల్లో ఇంకా జాప్యం జరుగుతోంది.

జూన్‌ చివరి వారంలోనే

జూన్‌ చివరి వారంలోనే

జూన్‌ చివరి వారంలోనే అనిల్ అంబానీ ఆర్‌కామ్‌కు డీఓటీ ఈ షోకాజు నోటీసు జారీచేసినట్టు తెలిసింది. 

ఈ నెల ప్రారంభంలోనే..

ఈ నెల ప్రారంభంలోనే..

ఈ నెల ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని, దానికి సమాధానం కూడా ఇచ్చినట్టు కంపెనీకి చెందిన అధికారులు చెబుతున్నారు.

బ్యాంకు గ్యారెంటీల కింద..

బ్యాంకు గ్యారెంటీల కింద..

అలాగే బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టెలికాం డిస్‌ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(టీడీశాట్‌) ఆదేశాల ప్రకారం బ్యాంక్‌ గ్యారెంటీల మొత్తాన్ని డీఓటీ తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది.

బ్యాంక్‌ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే

బ్యాంక్‌ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే

అయితే తాము బ్యాంక్‌ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే, డీఓటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా ఆర్‌కామ్‌ తన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఫండ్స్‌ను ఆర్‌కామ్‌ సమకూర్చుతుందో లేదో ఇంకా తెలియరాలేదు.

స్పెక్ట్రమ్‌ సేల్‌లో అనుమతించేందుకు ..

స్పెక్ట్రమ్‌ సేల్‌లో అనుమతించేందుకు ..

ఒకవేళ కంపెనీ బ్యాంక్‌ గ్యారెంటీలను నిర్దేశించిన సమయం లోపల చెల్లించకపోతే, కంపెనీని స్పెక్ట్రమ్‌ సేల్‌లో అనుమతించేందుకు డీఓటీ సమ్మతించకపోవచ్చని తెలుస్తోంది.దీంతో కంపెనీ మరింత కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

 జియోతో కుదుర్చుకున్న డీల్‌

జియోతో కుదుర్చుకున్న డీల్‌

ఇటువంటి పరిస్థితులు ఎదురయితే జియోతో కుదుర్చుకున్న డీల్‌ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

లైసెన్స్‌లను రద్దు చేస్తే

లైసెన్స్‌లను రద్దు చేస్తే

ఒకవేళ డాట్ హెచ్చరించినట్లే లైసెన్స్‌లను రద్దు చేస్తే, లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా డీఓటీ హెచ్చరించినట్టు అవుతుందని తెలుస్తోంది.

బిగ్ టివి బంపరాఫర్,

బిగ్ టివి బంపరాఫర్,

బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..

అనిల్ అంబాని కొత్త స్కెచ్

అనిల్ అంబాని కొత్త స్కెచ్

అనిల్ అంబాని కొత్త స్కెచ్, కళ్లు చెదిరే వ్యాపారంలోకి రీఎంట్రీ, అంతా రహస్యం !అనిల్ అంబాని కొత్త స్కెచ్, కళ్లు చెదిరే వ్యాపారంలోకి రీఎంట్రీ, అంతా రహస్యం !

టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై

టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై

తరువాత వ్యూహం ఇదే !తరువాత వ్యూహం ఇదే !

Best Mobiles in India

English summary
Furnish bank guarantees or lose licences: DoT to Reliance Communications more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X