LeEco టీవీలు వచ్చేస్తున్నాయ్!

తన Le 1S సూపర్‌ఫోన్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను శాసించిన LeEco మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ లీఇకో అభివృద్థి చేసిన సూపర్ టీవీలు అతిత్వరలో ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి.

LeEco టీవీలు వచ్చేస్తున్నాయ్!

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్థి చేయబడిన ఈ సూపర్ టీవీలు కనీవినీ ఎరగని ప్రత్యేకతలతో అటు ధర పరంగా, ఇటు పనితీరు పరంగా ఎంతో ఆకట్టుకంటాయి. త్వరలో సంచలనం రేపబోతోన్న లీఇకో టీవీలకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలివిజన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక కంపెనీలు వివిధ మోడల్స్‌లో టీవీలను ఆఫర్ చేస్తున్నాయి. కాలానుగుణంగా టెలివిజన్ వ్యవస్థలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు అనేక టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా చేసాయి.

 

మెరుగైన దృశ్య నాణ్యతతో

సీఆర్‌టీ (కాథోడ్ రే ట్యూబ్)లకు భిన్నంగా ప్లాట్ ప్యానల్ డిస్‌ప్లే టెక్నాలజీతో ఎల్‌సీడీ ఇంకా హైడెఫినిషన్ టీవీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి డైరెక్ట్ వ్యూ టీవీలతో పోలిస్తే మరింత స్లిమ్‌గా ఉంటాయి. ఈ తరహా టీవీలు తక్కువ స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా మెరుగైన దృశ్య నాణ్యతను అందిస్తున్నాయి.

 

కొత్త టీవీ కొనుగోలు చేస్తున్నారా..?

కొత్త టీవీలను కొనుగోలు చేసే విషయంలో, మీరు పరిగణంలోకి తీసుకువల్సిన
5 ముఖ్యమైన విషయాల..

ధర

మధ్య తరగతి ప్రజానికం ఎక్కువగా ఉండే ఇండియన్ మార్కెట్లో ధర అనే అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి వాతావరణంలో మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీ మన్నికైనదిగా ఉండాలి. ఇదే సమయంలో లేటెస్ట్ ఫీచర్లు కూడా ఆ టీవీలో ఉండి తీరాలి. క్యాష్ బ్యాక్స్, ఆన్‌లైన్ డిస్కౌంట్స్ వంటి అదనపు సదుపాయాలు, మీ కొనుగోలు చేసే టీవీకి వర్తించే అవకాశం ఉన్నట్లయితే మరికొత్త వాలెట్‌ను మీరు ఆదా చేయవచ్చు.

 

టీవీ సైజు

మార్కెట్లో 22 అంగుళాల దగ్గర నుంచి 120 అంగుళాల వరకు అనేక సైజుల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 32 నుంచి 65 అంగుళాల టీవీ సెట్‌ల వైపు ఎక్కువ శాతం మంది ఇండియన్ కస్టమర్‌లు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా 40 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం కలిగిన టీవీలను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందట.

 

పిక్షర్ రిసల్యూషన్ గురించి

మీరు ఒకవేళ 32 అంగులాల స్ర్కీన్ పరిమానం కలిగిన టీవీని ఎంపిక చేసుకోదలిచినట్లయితే ముందుగా పిక్షర్ రిసల్యూషన్ గురించి తెలుసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుత మర్కెట్లో HD, Full HD, UHD రిసల్యూషన్ క్వాలిటీలలో టీవీలు అందుబాటులో ఉన్నాయి.

 

స్ర్కీన్ రిసల్యూషన్స్ ఇలా ఉంటాయ్..

HD డిస్‌ప్లేతో వచ్చిన టీవీలలో పిక్షర్ రిసల్యూషన్ క్వాలిటీ గరిష్టంగా 720పిక్సల్ వరకు ఉంటుంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1366 x 768 పిక్సల్స్‌గా ఉంటుంది. Full HD డిస్‌ప్లేతో వచ్చే టీవీలలో రిసల్యూషన్ క్వాలిటీ 1920 x 1080 పిక్సల్స్‌గా ఉంటుంది. 4K డిస్‌ప్లేతో వచ్చే టీవీలలో రిసల్యూషన్ క్వాలిటీ 3840 x 2160 పిక్సల్స్‌గా ఉంటుంది.

4K క్వాలిటీ టీవీలు బెస్ట్

మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన కొన్ని హై-ఎండ్ టీవీలు హై డైనమిక్ రేంజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఎంపిక చేసుకునే టీవీ భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండాలంటే 4K క్వాలిటీ టీవీలను ఎంపిక చేసుకోండి.

 

కంటెంట్ విషయానికి వచ్చేసరికి

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదిస్తోన్న చాలా మంది యూజర్లు టీవీల్లో తమకు కావల్సిన టైమ్‌లో, తమకు నచ్చిన కంటెంట్‌ వీక్షించాలనుకుంటున్నారు. ఇటువంటి వారికోసం కొన్ని స్మార్ట్ టీవీ కంపెనీలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌తో కూడిన యాప్స్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్లో పట్టుబిగించేందుకు మరో అడుగు ముందుకేసిన LeEco విప్లవాత్మక స్మార్ట్ టీవీలను పరిచయం చేయబోతోంది.

 

Supertainment బండిల్డ్ ప్యాక్‌

త్వరలో మార్కెట్లోకి రాబోతున్న LeEco స్మార్ట్ టీవీలు కనీవిని ఎరగని ఫీచర్లతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనున్నాయి. కంటెంట్ ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తో వస్తోన్న లీఇకో స్మార్ట్ టీవీలు టెలివిజన్ ఎక్స్‌పీరియన్స్‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళతాయి. Supertainment బండిల్డ్ ప్యాక్‌తో వస్తోన్న LeEco టీవీల ద్వారా నాన్‌స్టాప్ సినిమాలు, పాటలు, లైవ్ షోలు వీక్షించవచ్చు.

 

నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌

LeEco తన లీ 1ఎస్ ఇకో, లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ల‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. Eros Now, YuppTV, Hungama Musicల భాగస్వామ్యంతో లీఇకో ఈ సేవలను అందిస్తోంది.

 

లోకల్ కంటెంట్.. హై క్వాలిటీ రేంజ్

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది. మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు.

 

రిచ్ కలర్

మీరు కొనుగోలు చేసే టీవీ, కలర్ పెర్పామెన్స్ విషయంలోనూ ఆకట్టుకునే విధంగా ఉండాలి. మీరు చూసే దృశ్యాలకు సంబంధించిన కలర్స్ సహజ సిద్ధమైన అనుభూతులను కలిగించాలి.

 

వేగవంతమైన పనితీరు

కంప్యూటర్ల తరహాలోనే నేటి ఆధునిక టీవీలకు స్పీడ్ అనేది చాలా అవసరం. మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌టీవీకి సంబంధించి మల్టీ టాస్కింగ్ అదరహో అనిపించాలంటే.. సీపీయూ, జీపీయూ వ్యవస్థలు శక్తివంతమైనవిగా ఉండాలి. సీపీయూ అనేది టీవీలోని సమాచారాన్ని వేగవంతంగా ప్రాసెస్ చేస్తుంది. జీపీయూ విషయానికి వచ్చేసరికి క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ దృశ్యాలను అందిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Future is Big: 3 days to go for the LeEco's mystery to unfold. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot