వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

Posted By:

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

మన రోజువారి జీవితాల్లో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లు.. ట్యాబ్లెట్ పీసీలు కమ్యూనికేషన్ టెక్నాలజీనిపూర్తి స్థాయిలో మార్చేసాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా సాధ్యమయ్యే పనిని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల చక్కబెట్టేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీ రాకతో ప్రాభవం కోల్పొయిన పలు గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కెమెరా

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

శక్తివంతమైన రేర్ ఇంకా ఫ్రంట్ కెమెరా వ్యవస్థలతో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు డిజిటల్ కెమెరాల అమ్మకాలను పూర్తిగా పడవేసాయి. యాపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ వంటి కంపెనీలు ఆఫర్ చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా వ్యవస్థను కలిగి అత్యుత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తున్నాయి.

పోర్టబుల్ మ్యూజిక్  ప్లేయర్

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

స్వతహాగానే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల మల్టీమీడియా ఫీచర్లను కలిగి ఉండటంతో పోర్టబుల్ మ్యూజిక్ ఇంకా వీడియో ప్లేయర్లకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.

పాత మోడల్ డెస్క్‌టాప్ కంప్యూటర్

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా సాధ్యమయ్యే పనిని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల ద్వారా చక్కబెట్టుకుంటున్నాం. పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తున్న ట్యాబ్లెట్ పీసీలు డెస్క్‌టాప్ ఇంకా ల్యాప్‌టాప్ అమ్మకాలను గణనీయంగా తగ్గించాయని ఓ విశ్లేషణలో తేలింది.

వాచ్

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు అందుబాటులోకి రావటంతో రిస్ట్ వాచ్‌లకు డిమాండ్ తగ్గింది. ప్రస్తుత జనరేషన్‌లో ఫ్యాషన్‌ను కోరకుంటున్న వారు మాత్రమే వాచ్‌లను దరిస్తున్నారు.

ఫ్లాష్‌లైట్

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

నేటి తరం మొబైల్ ఫోన్‌లు స్వతహాగానే ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి. దీంతో ఫ్లాష్‌లైట్‌లకు ఆదరణ కొరవడింది.

రేడియో

వీటి ద్యాసలో వాటిని మర్చిపోయాం

మొబైల్ ఫోన్‌లు మొదలుకుని స్మార్ట్‌ఫోన్‌ల వరకు అన్ని డివైస్‌లలో  ఇన్‌బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్‌ను ఏర్పాటు చేస్తుండటంతో సాంప్రదాయ రేడియోలకు పూర్తిగా గిరాకీ తగ్గిపోయింది.English summary
Gadgets Drastically Replaced By Mobile Phones, Tablets. Read more in Telugu Gizbot........
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting