బెడ్ రూమ్ ను సైబర్‌ చాట్ రూమ్ గా మారుస్తున్న నగరవాసులు

సోషల్ మీడియా మాయలో పడి నగరవాసులు నిద్రపోవడమే మానేశారు. ఏకాంతంగా ఉండే బెడ్ రూమ్ ను సైతం సైబర్‌ చాట్‌ రూమ్ లుగా మార్చేస్తున్నారు.

By Anil
|

సోషల్ మీడియా మాయలో పడి నగరవాసులు నిద్రపోవడమే మానేశారు. ఏకాంతంగా ఉండే బెడ్ రూమ్ ను సైతం సైబర్‌ చాట్‌ రూమ్ లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌,స్మార్ట్‌ఫోన్‌,ఐపాడ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్ ఇప్పుడు నిద్ర సమయంలోనూ బెడ్‌మీదకు చేరుతున్నాయి. దీంతో నగరవాసులు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచురీ మాట్రిసెస్‌ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల 'స్లీపింగ్‌ ట్రెండ్స్‌' పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది.

సెంచురీ మాట్రిసెస్‌ దేశవ్యాప్తంగా.....

సెంచురీ మాట్రిసెస్‌ దేశవ్యాప్తంగా.....

సెంచురీ మాట్రిసెస్‌ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్‌ ట్రెండ్స్‌పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్‌లైన్‌'లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, సహా స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్ మీడియాలో నిరంతరాయంగా అప్‌డేట్‌ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు.

 ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్సతోనే  గడుపుతూ.....

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్సతోనే గడుపుతూ.....

మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్సతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది.

మొదటి  స్థానంలో హైదరాబాద్.....

మొదటి స్థానంలో హైదరాబాద్.....

ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు లోని హైదరాబాద్ మరియు విశాఖపట్నం మొదటి రెండు స్థానాల్లో నిలవడం గమనార్హం.హైదరాబాద్ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా సైట్స్ అయిన ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.

రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నం.....

రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నం.....

ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్‌లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలింది.

డాక్టర్ల హెచ్చరిక....

డాక్టర్ల హెచ్చరిక....

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్ అవసరాన్ని బట్టి ఉపయోగించడం మంచిదని గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతినడమే గాక వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతని తద్వారా మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్‌ వస్తువులకు దూరంగా ఉండడం ఉత్తమమైన పని డాక్టర్లు చెబితున్నారు.

Best Mobiles in India

English summary
Gadgets ruining sleep: study.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X