రేపే ప్రతిష్టాత్మక Gaganyaan ప్రాజెక్టులో కీలక ప్రయోగం.. లైవ్ ఎక్కడ చూడాలంటే?
చంద్రయాన్, ఆదిత్య L1 మిషన్ల విజయంతో జోరుమీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో మరో కీలక ప్రాజెక్టును సన్నద్ధం అయింది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు వీలుగా ప్రారంభించిన గగన్‌యాన్ ప్రాజెక్టు (Gaganyaan) తొలి దశ టెస్టింగ్ అక్టోబర్ 21న జరగనుంది.
మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేసే లక్ష్యంతో ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టింది. వ్యోమగాములను అంతరిక్షంలోనికి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గగన్‌యాన్ ప్రయోగంలో వినియోగించే ఫ్లైట్ టెస్ వెహికల్ అబార్డ్ మిషన్ తొలి పరీక్షకు సిద్ధమైంది.

8.5 నిమిషాల్లోనే : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అక్టోబర్ 21 ఉదయం 8 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా క్రూమాడ్యుల్, క్రూ ఎస్కే్ప్ సిస్టమ్‌ను 17 కి.మీ ఎత్తులో విడిచిపెడుతుంది. అనంతరం పారాచూట్ సాయంతో బంగాళఖాతంలో పడుతుంది. దీన్ని ఇండియన్ నేవీ ఒడ్డుకు చేర్చనుంది. ఈ ప్రయోగం మొత్తం 8.5 నిమిషాల్లో పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
ఇది విజయవంతం అయితేనే : గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్ విజయవంతం అయితే 2025లో గగన్‌యాన్‌ను ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన పైలెట్లను రష్యాలోని వివిధ విభాగాల్లో కీలక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వారికి బెంగళూరులో శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని పరీక్షలు నిర్వహించి, 2025 నాటికి గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయాలని ఇస్రో భావిస్తోంది.
లైవ్ ఎక్కడ చూడాలంటే : ఈ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇస్రో అధికారిక వెబ్‌సైట్, అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతోపాటు దూరదర్శన్‌లోనూ ఈ లైవ్ వీక్షించవచ్చు. ఉదయం 7:30 గంటల నుంచి ఈ లైవ్ అందుబాటులో ఉంటుందని ఇస్రో వెల్లడించింది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర సామర్థ్యాన్ని ఇస్రో ప్రదర్శించనుంది. అందులో భాగంగా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. 400 కిలోమీటర్ల కక్ష్యలో మూడు రోజుల పాటు వివిధ రకాల పరిశోధనలు అనంతరం వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
*ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఇందులో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మినహా మిగిలిన ప్రాంతంలో రష్యా, అమెరికా, చైనా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.
చంద్రయాన్-3 ప్రయోగం అనంతరం ఇస్రో కీలక ఆదిత్య L1 ప్రాజెక్టు ప్రయోగించింది. ఇందులో భాగంగా భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న లాంగ్రాజ్ పాయింట్ నుంచి సూర్యుడి పరిస్థితులను నిశితంగా గమనించనుంది. ఇందులో భాగంగా 7 కీలక పేలోడ్‌లను పంపింది. జనవరి నాటికి ఆదిత్య L1.. లాంగ్రాజ్ పాయింట్‌కు చేరుకొనే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








