Gaganyaan టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పరీక్ష విజయవంతం.. ఇస్రో కీలక ప్రకటన!
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్ తొలిదశ టెస్టింగ్ విజయవంతం అయింది. ఉదయం 8 గంటలకు జరగాల్సిన ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సమస్యను వెంటనే పరిష్కరించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఉదయం 10 గంటలకు తొలి కీలక పరీక్షను విజయవంతంగా చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (TV-D1) ప్రయోగాన్ని విజయవంతం చేపట్టారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక శాస్త్రవేత్తలు అబార్డ్ సిగ్నల్‌ను పంపించారు. దీంతో సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థ రాకెట్ నుంచి వేరు అయింది. అనంతరం 17 కిలోమీటర్ల ఎత్తు వద్ద క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ మాడ్యూల్ విడిపోయాయి.

ఈ రెండు మాడ్యూళ్లు విడిపోయిన అనంతరం పారాచుట్ల సాయంతో శ్రీహరికోట తీరంలో సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ క్రూ మాడ్యుల్‌ను భారత నావిళ దళ బృందం సేకరించింది. ఇస్రో బృందానికి అందించనుంది. దీంతో గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (ISRO) వెల్లడించారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ కీలక టెస్టింగ్‌ను ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రయోగం చేపట్టాల్సి ఉంది. అయితే వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో 8:45 నిమిషాలకు చేపట్టాలని భావించారు. అయితే చివరి 5 సెకన్లలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని కొద్దిసేపు వాయిదా వేసి, ఉదయం 10 గంటలకు విజయవంతంగా చేపట్టారు.

సొంతంగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలని ఇస్రో (ISRO- Gaganyaan) లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రయోగ సమయంలో రాకెట్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా, క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి వ్యోమగాములను క్షేమంగా భూమి మీదకు తీసుకొస్తారు. దీనిని క్రూ ఎస్కేప్ సిస్టమ్‌గా పిలుస్తున్నారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడ వారు మూడు రోజలపాటు వివిధ రకాల పరిశోధనలు చేయనున్నారు. అనంతరం వారిని సురక్షితంగా భూమికి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం మూడు రకాల పరీక్షలు నిర్వహించి 2025 నాటికి గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.
ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్యL1 ప్రయోగాలతో భారత్ ఖ్యాతిని ఇస్రో విశ్వవ్యాప్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండింగ్ అయింది.
అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. రెండు వారాలు పాటు సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణం చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మినహా మిగిలిన ప్రాంతంలో రష్యా, అమెరికా, చైనా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.
అనంతరం ఇస్రో కీలక ఆదిత్య L1 ప్రాజెక్టు ప్రయోగించింది. ఇందులో భాగంగా భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న లాంగ్రాజ్ పాయింట్ నుంచి సూర్యుడి పరిస్థితులను నిశితంగా గమనించనుంది. ఇందులో భాగంగా 7 కీలక పేలోడ్‌లను పంపింది. జనవరి నాటికి ఆదిత్య L1.. లాంగ్రాజ్ పాయింట్‌కు చేరుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








