రెండు వేరియంట్లలో రానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 10

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ లో సంచలనం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే సక్సెసర్ లో భాగంగా ఇప్పుడు గెలాక్సీ నోట్10 సీరిస్

|

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ లో సంచలనం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే సక్సెసర్ లో భాగంగా ఇప్పుడు గెలాక్సీ నోట్10 సీరిస్ ను లాంచ్ చేయనుంది. కాగా ఈ ఫోన్ కి సంబంధించిన అనేక రకాలైన లీకులు ఇప్పటికే ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.

 
రెండు వేరియంట్లలో రానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 10

బిగ్గర్ డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుందని వార్తలు వస్తున్నాయి. అలాగే స్టైలిస్ ఎస్ పెన్ దీనికి అదనపు బలం కానుంది. కాగా శాంసంగ్ నుంచి రానున్న అ అప్ కమింగ్ ఫోన్ రెండు వేరియంట్లలో రానుందని తెలుస్తోంది.

బిగ్గర్ డిస్ ప్లే

బిగ్గర్ డిస్ ప్లే

గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మాదిరిగానే ఈ ఫోన్ 6.75-inch displayతో ఓ వేరియంట్ రాగా మరొక వేరియంట్ చిన్న సైజు డిస్ ప్లేతో రానుంది. దీనిని Galaxy S10eగా పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చిన్న సైజ్ ఎందుకు

చిన్న సైజ్ ఎందుకు

కాగా ఈ దక్షిణ కొరియా దిగ్గజం Galaxy S10e చిన్న సైజులో ఎందుకు తీసుకువస్తుందనే దానికి భిన్న వాదనలు వినిపిస్తన్నాయి. పెద్ద సైజు డిస్ ప్లే ఫోన్ కావాలనుకున్న వారు Galaxy Note 10 కొనుగోలు చేస్తారని, అలాగే తక్కువ సైజు డిస్ ప్లే కావాల్సిన వారు Galaxy S10eని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అదీగాక ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అయిన సంగతి తెలిసిందే.

తొలి బటన్‌లెస్ స్మార్ట్‌ఫోన్
 

తొలి బటన్‌లెస్ స్మార్ట్‌ఫోన్

ఈటీన్యూస్ ప్రకారం.. గెలాక్సీ నోట్ 10 అనేది శాంసంగ్ నుంచి వస్తున్న తొలి బటన్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్‌లో పవర్, వ్యాల్యూమ్, బిక్స్‌బి బటన్లు ఉండవు. ఇందులో సౌండ్, స్విచ్ ఆఫ్ వంటి బటన్లు అసలు ఉండవు.

టచ్ లేదా జెస్చర్ కీస్

టచ్ లేదా జెస్చర్ కీస్

వీటికి బదులు నోట్ 10లో టచ్ లేదా జెస్చర్ కీస్ ఉండొచ్చు. బటన్‌లెస్ ఫోన్ల కోసం ఎన్‌డీటీతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశముంది. ఎన్‌డీటీ సంస్థ కీలెస్ మోడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. గెలాక్సీ నోట్ 10కే మాత్రమే పరిమితం కాకుండా గెలాక్సీ ఏ సరీస్ స్మార్ట్‌ఫోన్లకు కూడా ఇదే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

శాంసంగ్ దారిలోనే ..

శాంసంగ్ దారిలోనే ..

వివో కూడా బటన్‌లెస్, పోర్ట్‌లెస్ ఫోన్ తీసుకురావాలని చూస్తోంది. అపెక్స్ 2019 కాన్సెప్ట్ ఫోన్‌ కూడా ఆవిష్కరించింది. ఒకవేళ గెలాక్సీ నోట్ 10 అందుబాటులోకి వస్తే శాంసంగ్ దారిలోనే ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు కూడా నడిచే అవకాశముంది.

  ఆగస్ట్‌లో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ఆగస్ట్‌లో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం

అయితే కన్సూమర్లు బటన్‌లెస్ ఫోన్లపై ఎలా స్పందిస్తారో తెలియడం లేదు. ఇకపోతే గెలాక్సీ నోట్ 10 ఆగస్ట్‌లో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశముందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 10 could be launched in two sizes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X