గబ్బర్‌సింగ్ తరహాలో ట్రెండ్ సెట్ చేస్తుందా..?

Posted By: Staff

గబ్బర్‌సింగ్ తరహాలో ట్రెండ్ సెట్ చేస్తుందా..?

 

ఓ వైపు గబ్బర్‌సింగ్ మానియా రాష్ట్రాన్ని షేకాడిస్తుంటే.. మరో వైపు సామ్‌సంగ్ ప్రవేశపెట్టిన స్మార్ట్‌పోన్ గెలాక్సీ ఎస్3 గ్యాడ్జెట్ ప్రియులను కొత్త మైమరుపుకు లోనుచేస్తుంది. గడిచిన బుధవారం యూరోప్‌తో సహా 26 దేశాల్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ భారీ అమ్మకాల దిశగా దూసుకుపోతుందని విశ్వసనీయవర్గాల సమాచారం. సామ్‌సంగ్ ఇండియా ఈ హ్యాండ్‌సెట్‌ను గురువారం ఇండియాలో విడుదల చేసింది. ధర రూ 43,180. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ఈ ఆధునిక స్మార్ట్‌ఫోన్ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అత్యాధునిక మొబైలింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న గెలాక్సీ ఎస్3, ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్’కు గట్టి పోటీనివ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి నుంచి 26 దేశాల్లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల్లో గెలాక్సీ ఎస్3ని లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ వర్గాలు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బుకింగ్ ద్వారా గెలాక్సీ ఎస్3ని దక్కించుకునే అవకాశాన్ని అనేక ఆన్ లైన్ రిటైలర్ సైట్లు కల్పిస్తున్నాయి. వాటిలో పలు ముఖ్యమైనవి..

- Samsung eStore,

- eBay,

- Snapdeal,

- Infibeam.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot