సామ్‌సంగ్ సీక్రెట్ ప్లానింగ్!

By Super
|
 Galaxy S4 Confirmed as GT-I9505, Samsung GT-Q1000 Spotted: Everything We Think We Know So Far

2013, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) సమీపిస్తున్న నేపధ్యంలో సామ్‌సంగ్ అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఈ ఏడాది ‘గెలాక్సీ ఎస్4’ ఇంకా ‘గెలాక్సీ నోట్3’ మోడళ్లలో రెండు ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ గాడ్జెట్‌ల పై భారీ అంచనాలు అలుముకున్న నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ‘జీటీ-క్యూ1000’ మోడళ్లో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ వృద్ధి చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేసే క్రమంలో సామ్‌సంగ్ వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికి ‘జీటీ-క్యూ1000’ మోడల్ పై నెలకున్న సందిగ్థత పై సామ్‌సంగ్ స్పందించాల్సి ఉంది.

రండి మేం ఫ్రీ….!

లేజర్ కీబోర్డ్‌తో ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4’?

2013కుగాను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా విడుదలకాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ హాటెస్ట్

గాడ్జెట్‌కు సంబంధించి తాజాగా బహిర్గతమైన ఓ వీడియో గెలాక్సీ ఎస్ (జీటీ-ఐ9500) ఫీచర్లను ఈ క్రింది విధంగా పేర్కొంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్4 లేజర్ కీబోర్డ్ ఫీచర్‌ను కలిగి ఉండటం విశేషం…

రోజిట్ కిడ్ వెలవరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్4 స్పిషికేషన్‌లు:

అల్ట్రా సిమ్, లైటెస్ట్,

1080 పిక్సల్ గ్రాండ్ ఆమెల్డ్ డిస్‌ప్లే,

13 మెగా పిక్సల్ కెమెరా,

2గిగాహెట్జ్ 4 క్వాడ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,

లేజర్ కీబోర్డ్.

అదిరిపోయే ఫోన్‌లు.. రూ.3,000 ధరల్లో!

పలు అనధికారిక నివేదికల ఆధారం సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ రేపటితరం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్ లు……

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X