గెలాక్సీ ఎస్5 ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను హ్యాక్ చేసేసారు!

Posted By:

గతంలో యాపిల్‌కు ఎదురైన చేదు అనుభవమే ఇప్పుడు సామ్‌సంగ్‌కు ఎదురైంది. యాపిల్ గతేడాది విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను నిక్షిప్తం చేసిన విషయం తెలిసిందే.

గెలాక్సీ ఎస్5 ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను హ్యాక్ చేసేసారు!

అయితే, ఆ ఫీచర్ ఎంత మాత్రం సురిక్షితం కాదని జర్మనీకి చెందిన ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ఎస్ఆర్ఎల్ ల్యాబ్స్ నిరూపించింది. స్పూఫింగ్ ఫింగర్ ఫ్రింట్ విధానం ద్వారా ఐఫోన్ 5ఎస్ ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను బ్రేక్ చేసిన ఎస్ఆర్ఎల్ ల్యాబ్స్ తాజాగా అదే విధానాన్ని సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5లోని ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఫీచర్ పై ప్రయోగించి ఫోన్‌లోని పేపాలా ఫీచర్‌లోకి సునాయాశంగా చొరబడగలిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గతంలో ఐఫోన్ 5ఎస్ కీలక సెక్యూరిటీ వ్యవస్థ అయిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఫీచర్‌ను జర్మనీకి చెందిన చావోస్ కంప్యూటర్ క్లబ్ బ్రేక్ చేసింది. ఈ గ్రూపుకు చెందిన బయోమెట్రిక్ హ్యాకింగ్ బృందం ముందుగా ఓ ఐఫోన్5ఎస్ యూజర్‌కు సంబధించిన వేలి ముద్రను గాజు ఉపరితలం పై సేకరించింది. గాజు ఉపరితలం పై సేకరించబడిన వేలిముద్రసాయంతో ఈ బృందం నకిలీ వేలిముద్రను సృష్టించి తద్వారా ఫోన్‌ను అన్ లాక్ చేయగలిగింది. నకిలీ వేలిముద్ర సాయంతో ఐఫోన్5ఎస్‌ను అన్‌లాక్ చేసిన తీరును చావోస్ కంప్యూటర్ క్లబ్ బ్రేక్ వీడియో రూపంలో ప్రచురించింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/sfhLZZWBn5Q?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot