ఆ హాట్ వీడియోకు కాసుల వర్షం!

Posted By: Prashanth

ఆ హాట్ వీడియోకు కాసుల వర్షం!

 

ఇటీవల కాలంలో ‘805 మిలియన్’లు వీక్షణలను అధిగమించి కెనడియన్ పాప్‌స్టార్ ‘జస్టిన్ బైబర్’ పేరిట ఉన్న రికార్డును తిరగరాసిన కొరియన్ పాప్‌‌స్టార్ ‘సై హూ’(Psy who) వైరల్ మ్యూజిక్ వీడియో ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్’ తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. ఒక్క యూట్యూబ్ ద్వారానే ఈ వీడియో $ 8 మిలియన్ల ఆదాయిన్న రాబట్టినట్లు గూగుల్ చీఫ్ బిజినెస్ అధికారి నికేష్ అరోరా వెల్లడించారు. ఇప్పటి వరకు 1.23బిలియన్ వీక్షణలను దక్కించుకున్న గ్యాంగ్‌నమ్‌ స్టైల్ వీడియో మరిన్ని కొత్త రికార్డులను నెలకొల్పే దిశగా దూసుకువెళుతుందని అరరో ఈ సందర్భంగా తెలిపారు.

ఈ వీడియో‌ను వీక్షించే వారి సంఖ్య రోజుకు 7 నుంచి 10 మిలియన్‌లు ఉంటుందని యూట్యూబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ టీనేజ్ సింగింగ్ సెన్షేషన్ జస్టిన్ బైబర్ ‘బేబీ నృత్యం’ రెండు సంవత్సరాల్లో సంపాదించిన 800 మిలియన్ వీక్షణల మైలురాయిని, ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్’ వీడియో కెవలం నాలుగు నెలలో సాధించి సంచలనాన్ని నమదు చేసింది.

వీడియో లింక్:

గాల్లో మంచం (కుబేరుల విలాసాలు)

Read In Tamil

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting