ఫేస్‌బుక్‌కి భారీ జరిమానా విధించిన జర్మనీ కోర్టు

Written By:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ యూజర్ల డాటాను ఎలా వినియోగించుకుంటున్నదో చెప్పాలని జర్మనీ కోర్టు ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ అలా చెప్పడానికి ఫేస్‌బుక్‌ నిరాకరించడంతో జర్మనీ కోర్టు భారీ జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌‌లో యూజర్లు పోస్టుచేస్తున్న మేధో సంపత్తి అంశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో వారికి తెలియజేయాలని జర్మనీ కోర్టు ఆదేశించగా .. అందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించిందని, అందుకే బెర్లిన్ రిజినల్ కోర్టు దానిపై 1.09 లక్షల డాలర్లు (రూ. 74 లక్షలు) జరిమానా విధించిందని వినియోగదారుల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది.

ఫేస్‌బుక్‌కి భారీ జరిమానా విధించిన జర్మనీ కోర్టు

ఫేస్‌బుక్‌ యూజర్ల డాటా పరిరక్షణ విషయంలో జర్మనీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇప్పటికే ఫేస్‌బుక్‌‌పై జర్మనీలో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే గతవారం ఫేస్‌బుక్‌ స్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ జర్మనీలో పర్యటించారు కూడా.

ఫేస్‌బుక్‌కి భారీ జరిమానా విధించిన జర్మనీ కోర్టు

అయితే యూజర్ల మేధోసంపత్తి పరిరక్షణలో ఫేస్‌బుక్‌ కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని, అది జర్మనీ, యూరప్లో వినియోగదారుల చట్టాలను తుంగలో తొక్కాలని భావిస్తున్ననది జర్మనీ వినియోగదారుల హక్కుల ఫెడరేషన్ (వీజెడ్బీవీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ఫేస్ బుక్ బంద్ చేశారు. అయితే జర్మనీలో కూడా ఇప్పుడు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read more: నిర్లక్ష్యానికి ఫేస్‌బుక్ భారీ మూల్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నార్త్ కొరియా

ప్రపంచం మొత్తం 5జీ నెట్ వర్క్ వెంట పడుతుంటే ఇక్కడ 3జీ నెట్ వాడుతుంటారు. అదీ ఫారిన్ నుంచి వచ్చే టూరిస్ట్‌లకు లిమిట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ దేశానికి ప్రపంచం గురించి తెలియదు. ఈ దేశ ప్రజలు ఇంటర్నెట్ పెద్దగా వాడరు. అసలు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కేవలం చాలా తక్కువ చోట్ల ఉంటుంది.ఇక ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ ఫేస్‌బుక్ పేజీని అసలు చూడలేము.

 

 

ఇరాన్

ఇరాన్ లో ఈ సైట్ ను బంద్ చేయాలని రాజకీయ నాయకులంతా పార్లమెంట్ లో తీర్మానించుకున్నారు. వీటివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందుకే బంద్ చేయాలని 2009లో పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాను అక్కడ బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు హసన్ రోహాని ట్విట్టర్ లో ఉన్నా కాని లేనట్లే ఉంటారు.

 

 

చైనా

మన పొరుగుదేశం చైనా గురించి ఇక చెప్పనే అవసరం లేదు. ఆ దేశం అన్నీ సోషల్ మీడియాను బంద్ చేసి సొంతంగా సోషల్ మీడియాను రూపొందించుకునే పనిలో బిజీగా ఉంది.

 

 

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ 2010లో ఫేస్‌బుక్‌ని బంద్ చేసింది. తమ దేశాధ్యక్షుడికి చెందిన కార్టూన్ ఫేస్‌బుక్‌లో సైటైరికల్ గా వాడటంతో వారంతా ఈ సైట్ ను బంద్ చేయాలని తీర్మానించారు. అయితే బంద్ అయిన వారం రోజులకు ఫేస్‌బుక్ ఆ ఇమేజ్‌ని తొలగించింది. అయినా నిషేధం అలానే కొనసాగుతోంది. Show Thumbnail

 

 

2011లో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్

2011లో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కొన్ని సోషల్ మీడియా సైట్లను బంద్ చేయాలని నిర్ణయించింది. వాటిల్లో ఈ ఫేస్‌బుక్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యమం జరుగుతన్న సమయంలో ఉద్యమకారులు ఎక్కువగా ఫేస్‌బుక్ వినియోగిస్తుండటంతో ముబారక్ సోషల్ మీడియాను బంద్ చేయాలని తీర్మానించారు.

 

 

సిరియాలో 2007 నుంచి ఫేస్‌బుక్

సిరియాలో 2007 నుంచి ఫేస్‌బుక్ బ్లాక్ అయింది. రాజకీయంగా బసద్ ఆలీకి వ్యతిరేకంగా ఉద్యమకారులు చెలరేగిపోవడం..ఆయన్ని గద్దె దింపాలని కొత్త ఉద్యమం లేవదీయడంతో చిర్రెత్తుకొచ్చిన బసద్ అన్ని సోషల్ మీడియా సైట్లకు రాంరాం చెప్పారు. అయినప్పటికీ సిరియన్లు కొన్ని ప్రొక్సీ సర్వర్ల ద్వారా కొన్ని సోషల్ మీడియా సైట్లను వాడుతున్నారు. Show Thumbnail

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write German court fines Facebook €109,000 in dispute over IP licence clause
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot