ఐడియా 30 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి

టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ క్ర‌మ క్ర‌మంగా త‌న వీవోఎల్‌టీఈ సేవ‌ల ప‌రిధిని విస్త‌రిస్తున్న‌ది. అందులో భాగంగానే తాజాగా మ‌రో 9 స‌ర్కిల్స్‌లో ఆ సేవ‌లను ఐడియా ప్రారంభించింది.

|

టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ క్ర‌మ క్ర‌మంగా త‌న వీవోఎల్‌టీఈ సేవ‌ల ప‌రిధిని విస్త‌రిస్తున్న‌ది. అందులో భాగంగానే తాజాగా మ‌రో 9 స‌ర్కిల్స్‌లో ఆ సేవ‌లను ఐడియా ప్రారంభించింది. మ‌హారాష్ట్ర (ముంబై త‌ప్ప‌), గోవా, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌డ్ ల‌లో ఇప్ప‌టికే ఐడియా 4జీ వీవోఎల్‌టీఈ సేవ‌లు షురూ కాగా ఇప్పుడు ముంబై, క‌ర్ణాట‌క, పంజాబ్, హ‌ర్యానా, వెస్ట్ బెంగాల్‌, యూపీ ఈస్ట్‌, యూపీ వెస్ట్‌, బీహార్‌, జార్ఖండ్‌, రాజ‌స్థాన్‌ల‌లోనూ ఆ సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కాగా నేటితో ఐడియా 4జీ వోల్టే సేవలు దేశవ్యాప్తంగా 15 సర్కిళ్లలోకి అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ ప్రకటించింది.

IRCTC కొత్త టెక్నాలజీ, ఇకపై వెయిటింగ్ లిస్ట్‌కి సెలవుIRCTC కొత్త టెక్నాలజీ, ఇకపై వెయిటింగ్ లిస్ట్‌కి సెలవు

వీవోఎల్‌టీఈ కాల్ చేస్తే వారికి 10 జీబీ డేటా

వీవోఎల్‌టీఈ కాల్ చేస్తే వారికి 10 జీబీ డేటా

వీవోఎల్‌టీఈ సేవ‌ల‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా ఐడియా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా మొబైల్ డేటాను కూడా అందిస్తున్న‌ది. ఆయా స‌ర్కిల్స్‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు త‌మ స్మార్ట్‌ఫోన్‌లో ఐడియా ద్వారా మొద‌టి సారిగా వీవోఎల్‌టీఈ కాల్ చేస్తే వారికి 10 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది.

4 వారాల త‌రువాత

4 వారాల త‌రువాత

అనంత‌రం 4 వారాల త‌రువాత ఆ సేవ గురించి ఫీడ్ బ్యాక్ ఇస్తే మ‌రో 10 జీబీ డేటాను అందిస్తారు. ఇక 8 వారాల త‌రువాత చివ‌ర‌కు మ‌రో 10 జీబీ డేటాను యాడ్ చేస్తారు. దీంతో మొత్తం క‌స్ట‌మ‌ర్ల‌కు 30 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది.

ఐడియా వోల్ట్ సర్వీసులు పొందాలంటే
 

ఐడియా వోల్ట్ సర్వీసులు పొందాలంటే

మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐడియా వోల్ట్ సర్వీసులు పొందాలంటే Settings -> Settings -> Mobile Network -> Turn on VoLTE call ని ఫాలో అయితే సరిపోతుంది.
అదే ఐవోఎస్ యూజర్లు అయితే Settings -> Mobile Data -> Mobile Data Options -> Enable 4G -> Turn on Voice & Dataని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా ఏదైనా సమస్యలుంటే 12345కి కాల్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.

ఐడియా 4జీ వోల్ట్ సర్వీసులను అందించే ఫోన్లు

ఐడియా 4జీ వోల్ట్ సర్వీసులను అందించే ఫోన్లు

Vivo V7 Plus, Honor 5C, Honor 6X, Honor 7X, Honor View 10, Honor 9 lite, Honor 9i handsets. Xiaomi Redmi 4, Samsung Galaxy J7 Pro/Galaxy A5/Galaxy A7, OnePlus 5/5T/6 and Nokia 3/5, Nokia 6.1, Nokia 7 Plus ఈ ఫోన్లకు ఐడియా 4జీ వోల్ట్ సర్వీసులను లాంచ్ చేసింది.

ఆయా సర్కిళ్లలో

ఆయా సర్కిళ్లలో

ఆయా సర్కిళ్లలో అన్ని జిల్లా కేంద్రాల్లో 4జీ సేవలు లభిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల మొదట్లోనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సహా ఆరు సర్కిళ్లలో ఈ సేవలు ఆరంభం కాగా, తాజాగా తొమ్మిది సర్కిళ్లలో 4జీ వోల్టే సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Idea 4G VoLTE Service Expands to 15 Circles, Now Offering 30GB Free Data to Early Adopters More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X