మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు,1జీబి 4జీ ఇంటర్నెట్ మీకు ఉచితంగా లభిస్తుంది

రిలయన్స్ జియోతో పోటీపడే క్రమంలో టెలికం సర్వీస్ ప్రొవైడర్లు కొత్తగా అనిపించే ఏ ఒక్క ఆఫర్‌ను విడిచిపెట్టడం లేదు. వినియగదారులు తమ నుంచి చేజారిపోకుండా ఉండేందుకు సరికొత్త తాయిలాలతో ఊరించే ప్రయత్నించే చేస్తున్నాయి.

మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు,1జీబి 4జీ ఇంటర్నెట్ మీకు ఉచితంగా లభిస్తుంది

ప్రస్తుత టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య నువ్వానేనా అన్న చందాన పోటీ నడుస్తోంది. రిలయన్స్‌‌తో పోటీ పడే క్రమంలో ఎయిర్‌టెల్‌ రోజుకో ఉచిత 4జీ ఆఫర్‌తో ముందుకొస్తోంది...

Read More : వొడాఫోన్ సంచలన ఆఫర్.. 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త 4జీ యూజర్లకు...

తాజాగా ఎయిర్‌టెల్‌ కొత్త 4జీ యూజర్లకు 1జీబి 4జీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ డేటాను 28 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు.

ఈ ఉచిత డేటాను ఎలా పొందాలి..?

ఈ ఉచిత డేటా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ నెంబర్ నుంచి 52122 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

కాల్ డిస్కనక్ట్ అయిన వెంటనే...

ఆ కాల్ డిస్కనక్ట్ అయిన వెంటనే ఓ ఎస్ఎంఎస్ మీకు అందుతుంది. మీ మొబైల్ నెంబర్ తాలుకా అకౌంట్ లో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా క్రెడిట్ అయినట్లు ఆ మెసేస్ సారాంశం ఉంటుంది. 

బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు

వెంటనే బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు #121*2#కు డయల్ చేయండి.

ఇప్పటి వరకు ఏ విధమైన 4జీ డేటా ప్లాన్‌ను....

ఇప్పటి వరకు ఏ విధమైన 4జీ డేటా ప్లాన్‌ను వినియోగించుకోని యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఇప్పటికే ఏదైనా యాక్టివ్ 4జీ డేటా ప్లాన్‌లో ఉన్నట్లయితే ఈ ఆఫర్ మీకు వర్తించదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Get FREE Airtel 4G Data With Just a Missed Call. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot