Jio 4G సిమ్‌ను ఉచితంగా పొందటం ఎలా..?
వస్తూవస్తూనే దిమ్మతిరిగే ఆఫర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో 4జీ సిమ్ తన 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో దేశీయంగా హాట్ టాపిక్ అయ్యింది. జియో సిమ్ కార్డ్ పొందే ఆఫర్‌ను కొద్ది రోజుల క్రితం లైఫ్, సామ్‌సంగ్ ఇంకా ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే రిలయన్స్ అందుబాటులో ఉంచింది.

Read More : Jio ఎఫెక్ట్, మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 10 ఫోన్‌లు
తాజాగా అప్‌డేట్ నేపథ్యంలో 4జీబి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో కూడిన జియో సిమ్‌ను పొందవచ్చని రిలయన్స్ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Jio 4G SIM కోసం రిలయన్స్ స్టోర్స్ ఎదుట బారులు తీరుతున్నారు. సూపర్ ఫాస్ట్ 4జీ కనెక్టువిటీతో వస్తోన్న రిలయన్స్ జియో 4జీ సిమ్‌ను ఉచితంగా సొంతం పొందేందుకు సింపుల్ టిప్స్...

టిప్ 1
ఉచిత జియో 4జీ సిమ్ కార్డ్‌ను పొందేందుకు MyJio appను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన అవసరం లేదు. మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా మినీ స్టోర్‌కు వెళ్లటం ద్వారా Jio 4G SIMకు సంబంధించిన కోడ్‌ను పొందవచ్చు.

టిప్ 2
Jio 4G SIMపై అందిస్తోన్న 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు అన్‌లిమిటెడ్ 4జీ డేటా, కాల్స్ ఇంకా మెసేజ్‌లను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఆఫర్‌ను యాక్సెస్ చేసుకునే క్రమంలో Jio app suiteను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

టిప్ 3
ఉచిత జియో 4జీ సిమ్ కార్డ్‌ను పొందే క్రమంలో మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ వద్దకు KYC డాక్యుమెంట్‌లతో వెళ్లండి.

టిప్ 4
మీరు రిలయన్స్ ఉద్యోగి అయినట్లయితే ఎటువంటి కూపన్ కోడ్స్ల్ లేకుండా జియో 4జీ సిమ్ కార్డ్‌లను పొందవచ్చు.

టిప్ 5
జియో 4జీ సిమ్‌ను మీ ఫోన్‌లో యాక్టివేట్ చేసుకునే క్రమంలో ముందుగా సిమ్‌కార్డ్‌ను ఫోన్‌లో ఇన్‌సర్ట్ చేయండి. సిగ్నల్ బార్స్ వచ్చిన వెంటనే సంబంధిత మొబైల్ నెంబర్ కు కాల్ లేదా ఎస్ఎంఎస్ అందుతుంది. JioJoin appను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. LYF లైనప్ ఫోన్ లలో JioJoin appను ఇన్‌బుల్ట్‌గా అందిస్తున్నారు.

టిప్ 6
90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా Jio app suite అందించే జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ వంటి సర్వీసులను ఉచితంగా ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








