ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యాడ్స్..?

By Sivanjaneyulu
|

ఎక్కువ మంది వినియోగదారులను కలిగిన ఉన్న యాప్స్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్ ఒకటి. త్వరలో ఈ యాప్ కు మరిన్ని కమర్షియల్ హంగులు జతకాబోతున్నాయి. TechCrunch తెలిపిన వివరాల మేరకు ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్ లో పెయిడ్ యాడ్స్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తమ వినియోగదారులతో ఇప్పటికే మెసెజ్ త్రెడ్స్ ద్వారా టచ్ లో ఉన్న వ్యాపార సంస్థలు ఇక పై తమ సేల్ అనౌన్స్‌మెంట్స్ ఇంకా ప్రోడక్ట్ సమాచారాన్ని యాడ్స్ రూపంలో మెసెంజర్ లో పోస్ట్ చేసే వీలుంటుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యాడ్స్..?

మరికొద్ది నెల్లలో ఈ ఫీచర్ అందుబాుటలోకి రాబోతోంది. తమ మెసెంజర్ యాప్ 80 కోట్ల మంది నెలవారి యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతుందని ఫేస్‌బుక్ ఇటీవల వెల్లడించింది. మెసెంజర్ యాప్‌ను రోజురోజుకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో ఫేస్‌బుక్ సఫలమవుతోంది. పోటీ మార్కెట్ నేపథ్యంలో మెసెంజర్ యాప్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తోన్న ఫేస్‌బుక్ సరికొత్త అప్‌డేట్‌లతో యూజర్లకు స్వాగతం పలుకుతోంది. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను వినియోగిస్తున్న ప్రతిఒక్కరు తెలుసుకోవల్సిన 10 విషయాలను ఇప్పుడు చూద్దాం...

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్‌ను డెస్క్‌టాప్ పై కూడా వాడుకోవచ్చు అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్
 

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్‌ టిప్స్

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Get ready for ads in Facebook Messenger. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X