రిలయన్స్ మొదలుపెట్టింది, మీ ఇంటికే జియో 4జీ సిమ్!

రిలయన్స్ జియో సిమ్ కోసం ఇక పై స్టోర్‌ల ముందు నిలబడి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. జియో ప్రతినిధులు నేరుగా మీ ఇంటికి వచ్చి జియో జియో సిమ్‌ను అందిస్తారు.

రిలయన్స్ మొదలుపెట్టింది, మీ ఇంటికే జియో 4జీ సిమ్!

Read More : ఇప్పటికిప్పుడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

గతంలో ప్రకటించిన విధంగానే రిలయన్స్ తన జియో 4జీ సిమ్ హోమ్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ సదుపాయం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశముంది. హోమ్ డెలివరీ ప్రక్రియ ద్వారా మీరు కూడా జియో సిమ్ పొందాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి

జియో సిమ్‌లు ప్రస్తుతం రిలయన్స్ జియో సిమ్ రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిని సొంతం చేసుకోవాలంటే.? రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకుంది.

డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని..

జియో సిమ్‌లకు దేశవ్యాప్తంగా నెలకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్ డోర్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీస్ కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబై, అహ్మదబాద్ ఇంకా పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

రిలయన్స్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి

హోమ్ డెలివరీ సర్వీస్ ద్వారా జియో సిమ్‌ను సొంతం చేసుకోవాలనుకునే యూజర్లు రిలయన్స్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఉంటున్న లోకేషన్‌లో జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉందో, లేదో చెక్ చేసుకోండి.

వారం రోజుల్లోపు డెలివరీ..

ఒకవేళ సర్వీస్ అందుబాటులో ఉన్నట్లయితే మీ చిరునామాతో పాటు ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసిన వారం రోజుల్లోపు సిమ్ మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.

జియో సిమ్ మీ అడ్రస్‌కు డెలివరీ అయిన వెంటనే...

జియో సిమ్ మీ అడ్రస్‌కు డెలివరీ అయిన వెంటనే జియో ప్రతినిధుల బృందం మీ చిరునామాకు వచ్చి ప్రూఫ్ క్రింద మీరు సబ్మిట్ చేసిన ఆధార్ కార్డ్‌ను వెరిఫై చేసి ekyc మెచీన్ ద్వారా మీ వేలిముద్రలను తీసుకుంటుంది. వెరిఫికేషన్ విజయవంతమైన కొద్ది గంటల్లోనే మీ జియో 4జీ సిమ్ యాక్టివేట్ కాబడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How You Can Get Your Reliance Jio SIM Delivered to Your Home. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot