స్పేస్ సెల్ఫీ రూ.50,000కే!

Posted By:

 స్పేస్ సెల్ఫీ రూ.50,000కే‍!

అక్కడా, ఇక్కడా కాదు ఏకంగా అంతరిక్షం నుంచే సెల్ఫీ తీసుకోవాలనుందా..?, అయితే మీకో గుడ్ న్యూస్... దక్షిణ యార్క్‌షైర్ (బ్రిటన్), యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్‌కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీరింగ్ విద్యార్థుల అలెక్స్ బేకర్, క్రిస్ రోస్‌లకు రూ.50,000 చెల్లిస్తే చాలు మీకు డూ ఇట్ యువర్ సెల్ఫ్ పేరుతో ఓ స్పేస్ బెలూన్ కిట్‌ను మీకందజేస్తారు. ఈ కిట్ ద్వారా మీరు ఫోటోలు, వస్తువులను రోదసీకి పంపి అందమైన సెల్ఫీలను చిత్రకరించుకోవచ్చు.

ఈ ప్రక్రియను అలెక్స్ బేకర్, క్రిస్ రోస్‌‌ల జోడి 2011లోనే శ్రీకారం చుట్టింది. ఔత్సాహికుల ఫోటోలు, వస్తువులను స్పేస్  బెలూన్‌కు కట్టి అంతరిక్షంలోకి పంపడం, బెలూన్‌కు అమర్చిన డిజిటల్ కెమెరాలలతో సెల్ఫీలను చిత్రీకరించటం వీరి వ్యాపారంగా మారింది. బెలూన్‌లు నేల పై పడిన తరువాత జీపీఎస్ ఆధారంగా వస్తువులను వెతికిపట్టుకునే వీరు ఇప్పటి వరకు ఒకసారి తప్ప అన్ని సార్లూ రోదసికి పంపించిన వస్తువులను తిరిగి పట్టుకోగలిగారు!.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Get yourself a customized space selfie. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot