జపాన్‌లో ట్విట్టర్ ద్వారా స్నేహితులకు రియల్ గిప్ట్స్ పంపుతున్న గిప్టీ

Posted By: Staff

జపాన్‌లో ట్విట్టర్ ద్వారా స్నేహితులకు రియల్ గిప్ట్స్ పంపుతున్న గిప్టీ

ట్విట్టర్ ప్రస్తుత సమాజంలో ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోతున్న సామాజిక వెబ్‌సైట్. ఇప్పుడు ట్విట్టర్‌ని ఓ ప్రత్యేక సాధనంగా వాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల జపాన్‌లో ట్విట్టర్‌ని ఉపయోగించి ప్రెండ్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారికి గిప్ట్స్ పంపించడానికి కూడా వాడుతున్నారు. దీనికోసం గిప్టీ అనే సర్వీస్ ను వాడుతున్నారు. గిప్టీ అనేది ఓ కొత్త సర్వీస్. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి బీటా వర్సెన్ మార్కెట్‌‍లో ఉంది. దీని ద్వారా ధ్యాంక్యూ గిప్ట్ వయా ట్విట్టర్ లాంటి మెయిల్స్‌ని స్నేహితులకు పంపుకోవచ్చు.

ఇందులో నుండి మీరు మీ స్నేహితులకు గిప్ట్స్ పంపాలంటే మీరు ఈ సూచనలను పాటించాల్సిందే. మొదటగా మీరు గిప్టీ అనే సైట్‌లోకి వెళ్శి ట్విట్టర్ ఐడి ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో గిప్టీ మీకు జపాన్‌లో ఉన్నటువంటి కొన్నిషాప్స్ ద్వారా ఆప్సన్స్ కల్పిస్తుంది. ఇందులో మీరు మీ స్నేహితులకు ప్లవర్స్, కేక్స్, కాఫీ, బీర్ సెట్స్ లాంటివి పంపవచ్చు. ఇందులో మీకు కావాల్సినటువంటి గిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోని క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత గిప్టీ మీరు ఎవరికైతే గిప్ట్ పంపించాలని అనుకుంటున్నారో వారికి ట్విట్టర్ ద్వారా గిప్ట్ ట్వీట్‌ని పంపిస్తుంది. మీకు ఎవరైనా స్వీట్ ప్రెండ్స్ ఉంటే వారి కోసం మీరు చాక్లెట్ ట్వీట్‌ని పంపించాల్సిందే... వివరాల కోసం మీరు ఈ సైట్‌ని చూడండి Giftee

అదేవిధంగా మీకోసం ప్రత్యేకంగా గిప్టీ స్క్రీన్ షాట్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot