జింజెర్‌బ్రెడ్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి గిరాకీ..!

Posted By: Prashanth

జింజెర్‌బ్రెడ్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి గిరాకీ..!

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వివిధ రకాల వర్సన్స్‌ని విడుదల చేసింది. తాను విడుదల చేసిన ఇన్ని రకాల అపరేటింగ్ సిస్టమ్స్‌లలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన డివైజ్‌లు ఎక్కువగా అమ్ముడైనాయో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో గూగుల్ ఇటీవల ఓ సర్వేని చేయించింది. ఈ సర్వే ప్రకారం గూగుల్ ఆండ్రాయిడ్ జింజెర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన డివైజ్‌లు మార్కెట్లో 58 శాతం షేర్‌ని సొంతం చేసుకున్నాయని తెలిసింది.

ఆండ్రాయిడ్ జింజెర్‌బ్రెడ్  ఆపరేటింగ్ సిస్టమ్‌కు ముందు గూగుల్ విడుదల చేసిన హానీకూంబ్ ఆపరేటింగ్ సిస్టమ్ కేవలం 3.4 శాతం మార్కెట్‌ని సొంతం చేసుకోగలిగింది. ఈ సందర్బంలో గూగుల్ చైర్మన్ ఎరిక్ స్కామిడిస్ట్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా  ఫ్రాగ్మాంటేషన్ సమస్య గురించి మాట్లాడటం చూశాం. దానిని అధిగమించేందుకు గాను, వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను ఆండ్రాయిడ్ జింజెర్‌బ్రెడ్ ఖచ్చితమైన ఆపరేటింగ్ సిస్టమ్ అవడమే కాకుండా వైవిధ్యమైన పరికరాలకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో దానిని రూపొందించామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot