Gionee F8 Neo: రూ.5000 బడ్జెట్ ధరలో జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!! ఫీచర్స్ అదుర్స్
బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలని కోరుకునే వారి కోసం జియోనీ సంస్థ కొత్తగా ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. జియోనీ F8 నియో పేరుతో విడుదల అయిన ఈ ఫోన్ ఇండియాలో కేవలం రూ.5,000 ధర విభాగంలో విడుదల అయింది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇది ఫేస్ అన్‌లాక్, స్లో మోషన్, బ్యూటీ మోడ్ మరియు నైట్ మోడ్ వంటి ఫీచర్లతో ప్రీలోడ్ చేయబడిన జియోనీ F8 నియో కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోనీ F8 నియో ధరల వివరాలు
ఇండియాలో జియోనీ F8 నియో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసారు. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ సింగల్ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ యొక్క ధర కేవలం 5,499 రూపాయలు మాత్రమే. దీనిని వినియోగదారులు బ్లాక్, బ్లూ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీనిని స్థానిక రిటైల్ నెట్‌వర్క్ ఉడాన్‌లో భాగమైన రెండు లక్షల మొబైల్ రిటైలర్ల ద్వారా దేశంలో కొనుగోలు చేయవచ్చు.

జియోనీ F8 నియో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
జియోనీ F8 నియో స్మార్ట్‌ఫోన్ 720x1,440 పిక్సెల్ పరిమాణంలో 18: 9 కారక నిష్పత్తితో 5.45-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ యునిసోక్ SC9863 SoC తో పాటు 2GB RAMతో జతచేయబడి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపున 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో గల సింగల్ కెమెరాతో వస్తుంది. ఇది ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో జతచేయబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

జియోనీ F8 నియో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్
జియోనీ F8 నియో స్మార్ట్‌ఫోన్ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 250GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి కలిగి ఉండి 3,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో జెమ్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండదు.


Click it and Unblock the Notifications








