బడ్జెట్ ధరకే జియోనీ ఎఫ్9 ప్లస్, హైలెట్ ఫీచర్ అదే
మొబైల్ సంస్థ జియోనీ ఎఫ్ 9 ప్లస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరాలాంటి అద్భుత ఫీచర్లతో ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. 6.26-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.7690గా నిర్ణయించింది. ఈ కామర్స్ సైట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది.

జియోనీ ఎఫ్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.26 ఇంచ్ డిస్‌ప్లే, 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలతో బ్రాండ్లు అభివృద్ధి చెందాలి ,సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలి. ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు, జియోనీ ‘జీబడ్డీ' పేరుతో కొత్త సబ్ బ్రాండ్‌ను కూడా ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్ , పవర్ బ్యాంక్‌లను ఆవిష్కరించింది.

ఇదిలా ఉంటే జియోనీ మళ్లీ మార్కెట్లోకి తిరిగి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. bankruptతో ఈ మధ్య జియోనీ సతమతమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జియోనీ నుంచి త్వరలో Gionee M11 and Gionee M11s విడుదల చేయనుంది. six key highlightsతో ఈ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుందని ITHome రిపోర్ట్ చేసింది. ఈ ఫోన్లను ఇతర కంపెనీ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి తీసుకురానుందని టీనా, మై డ్రైవ్ లాంటి సైట్లు కూడా తెలిపాయి.

కొత్తగా రాబోతున్న జియోనీ ఎమ్11 సీరిస్ ఫోన్లలో ఈ కింది ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
6.21-inch display
2.5D curved waterdrop notch displays
rear fingerprint scanner
glass-like panels
6GB RAM and 128GB storage
4,000mAh battery
2.0GHz MediaTek octa-core processor
16MP + 5MP dual-camera
13MP front-facing camera
Android 8.1 Oreo


Click it and Unblock the Notifications