జియోనీతో చేతులు కలిపిన ప్రభాస్

బాహుబలి సినిమాతో జాతియ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆలియా భట్, శృతీహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోశాంజ్‌లతో జియోనీ ఇప్పటికే ఒప్పందం కుదర్చుకుంది. తాజాగా ఈ జాబాతాలోకి ప్రభాస్ వచ్చి చేరారు.

జియోనీతో చేతులు కలిపిన ప్రభాస్

ప్రభాస్ తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించటం తమకు గర్వకారణమని, శక్తివంతమైన బ్యాటరీలో పాటు ఉత్తమ క్వాలిటీ సెల్ఫీ కెమెరాలతో వస్తోన్న తమ ఫోన్‌లకు ప్రభాస్ తోడవటం వల్ల తమ బ్రాండ్ వాల్యూ మరింత బలపడుతుందని జియో ఇండియా సీఈఓ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ ఆర్ వోహ్ర ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాల క్రితం ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన జియోనీ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ 1.25 కోట్ల కస్టమర్‌లను సంపాదించుకోగలిగింది.

English summary
Gionee India ropes in Bahubali's Prabhas as brand ambassador. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot