Gionee Max Pro బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! త్వరలోనే అమ్మకాలు...
ప్రముఖ చైనా టెక్నాలజీ కంపెనీ జియోనీ తన యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ల విస్తరణలో భాగంగా ఇండియాలో నేడు జియోనీ మాక్స్ ప్రో విడుదల చేసారు. సంస్థ యొక్క సరికొత్త ఈ హ్యాండ్‌సెట్ "న్యూ-ఏజ్ గాడ్జెట్ ప్రేమికులను" లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రకటించింది. 6,000mAh భారీ బ్యాటరీ, 6.52-అంగుళాల డిస్ప్లే వంటి ఫీచర్లతో పాటు ఈ ఫోన్ 60 గంటల వరకు టాక్-టైమ్ను అందిస్తుంది. 3GB ర్యామ్ మరియు 32GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి బడ్జెట్ ధరలో లభించే కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోనీ మాక్స్ ప్రో ధరలు & సేల్స్ వివరాలు
జియోనీ మాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ లో విడుదల చేసింది. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 8 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో బ్లూ, బ్లాక్ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

జియోనీ మాక్స్ ప్రో స్పెసిఫికేషన్స్
జియోనీ మాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో రన్ అవుతుంది. అలాగే ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణతో 6.52-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను 720x1560 పిక్సెల్స్ రెసొల్యూషన్ మరియు ఫుల్-వ్యూ డ్యూడ్రాప్ ను కలిగి ఉంది. ఇది 3GB RAM తో జతచేయబడిన ఆక్టా-కోర్ యునిసోక్ 9863A SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ‘బోకె లెన్స్' కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

జియోనీ మాక్స్ ప్రో ఫీచర్స్
జియోనీ మాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్ లోని ఇతర ఫీచర్లలో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. ఇందులోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం మైక్రో-యుఎస్‌బి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ మరియు ఫేస్ అన్‌లాక్‌లతో వస్తుంది. ఇది 165x75x10mm కొలతలతో 212 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








