చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ...జియోనీ త్వరలో మరోకొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ ఏడాది మే నెలలో నాలుగు కెమెరాలతో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.
ఈ ఫోన్ రిలీజ్ అయి కొన్ని నెలలు గడుస్తున్నా...ఇంకా ఇండియాలో ఈ ఫోన్ రిలీజ్ కాలేదు. అయితే ఇండియాలో ఇప్పుడు జియోనీ ఎస్10 లైట్ అని పిలిచే డివైస్ ను రిలీజ్ చేసే ప్రయత్నంలో కంపెనీ ఉంది. వాటర్ డౌన్ వేరియంట్ తో వచ్చేందుకు కంపెనీ రెడీగా ఉంది.
91మొబైల్స్ అనే రిపోర్టు ప్రకారం...జియోనీ ఎస్ 10 లైట్...ఒక మిడ్ రేంజ్ మోడల్ స్మార్ట్ ఫోన్. ఇండియాలో డిసెంబర్ నాలుగో వారంలో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు లభ్యత గురించిన సమాచారం ఎప్పటివరకు లేదు. డివైస్ మిడ్ రేంజ్ స్పేసిఫికేషన్స్ కలిగి ఉన్నందున...అందరికీ అందుబాటులో ఉండే ధరతో మార్కెట్లోకి రానునుందని అంచనా వేయవచ్చు.
స్పెసిఫిక్స పరంగా చూసినట్లయితే...జియోనీ ఎస్10లైట్, 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో ...5.2 అంగుళాల హెడ్జి డిస్ప్లేతో వస్తుంది. కంటి రక్షన మోడ్ మరియు స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఉంటుంది. స్నాప్ డ్రాగెన్ 427 చిప్ సెట్ డివైస్ తో పాటు 4జిబి ర్యామ్, 32జిబి డిఫాల్ట్ మెమెరీ స్పేస్ను కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డు సహాయంతో...స్పేస్ ను 256జిబి వరకు విస్తరించుకోవచ్చు.
ఇండియా మార్కెట్ని శాసిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్ఫోన్లు ఇవే !
ఎస్10లైట్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ తో రన్ అవుతుంది. అమిగో 4.0 uiతో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ ఫోన్లో app wh lock , వాట్సప్ క్లోన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాట్సప్ అకౌంట్స్ మరియు ప్రైవేట్ స్పేస్ వంటి స్పేషల్ అట్రాక్షన్స్ అని చెప్పవచ్చు.
ఇమేజింగ్ కోసం , జియోనీ నుంచి స్మార్ట్ ఫోన్ ఎల్ఈడి ఫ్లాష్ తోపాటు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఉపయోగించుకుంటుంది. సెల్ఫీ కెమెరా అడ్వాన్స్డ్ బూకె అల్గోరిథంలు మరియు ఫేస్ రికగ్నైజ్ కు సపోర్టు ఇస్తుంది. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ f/2.0 ఎపర్చరు, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ మరియు pdafతో 13మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సర్తో హోం బటన్ ఉంటుంది. ఒక మంచి బ్యాకప్ అందించగల 3100ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కానీ అది వేగంగా ఛార్జింగ్ అయ్యేందుకు సపోర్టు ఇవ్వదు.
ఈనెల చివరి నాటికి ఈఫోన్ రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ....సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.