త్వరలో క్వాడ్ కెమెరాలతో జియోనీ S11 స్మార్ట్ ఫోన్ రిలీజ్!
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోనీ...గతేడాది నవంబర్లో చైనా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. దాదాపు 8 కొత్త మోడళ్లను జియోనీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం, ఈ సంస్థ జియోనీ S11తో ప్రారంభమయ్యే డివైసులను భారత మార్కెట్లోకి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

టెక్ హుక్ రిపోర్ట్ ప్రకారం, చైనా బేస్డ్ కంపెనీ 2018 జనవరిలో ఇండియాలో జియోనీ S11స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ డివైసు చైనాలో 1,799యువాన్ (సుమార్ 17,600రూపాయలు) వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ను స్టాక్ సంబంధిత జాప్యాల కారణంగా వచ్చే నెల చివరికి రిలీజ్ చేయనుంది.
ఈ ఫోన్ 20,000రూపాయలకు అందుబాటులో ఉండనుంది. అయితే ఖచ్చితంగా ఎంత ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందన్న సమాచారం లేదు. ఫోన్ రిలీజ్ సమయంలో ధర,లభ్యత గురించి ప్రకటించే అవకాశం ఉంది.
ఇక స్పెసిఫికేషన్ల పరంగా చూసినట్లయితే..జియోనీ S11, 5.99అంగుళాల డిస్ప్లేతో సన్నని బెజెల్స్, ఫుల్ హెచ్డి + 2160,1080పిక్సెల్స్ రిజల్యూషన్,18:9 యాస్పెక్ట్స్ రేషియో కలిగి ఉంటుంది. దాని హుడ్ కింద స్మార్ట్ ఫోన్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ ఉపయోగించి మరింత విస్తరించుకోవచ్చు. ఇది 4జిబి ర్యామ్ , 64జిబి స్టోరేజి స్పేస్ తో 2.5గిగా ఆక్టాకోర్ మీడియా టెక్ MT6737T హెలియో పి23 ప్రొసెసర్ ను ఉపయోగిస్తుంది.
4జి, వోల్ట్, వైఫై 3.5ఎంఎం ఆడియో జాక్ మరియు మరిన్ని హైబ్రిడ్ సిమ్ స్లాట్ వంటి స్టాండర్డ్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. హ్యాండ్ సెట్ ఒక పూర్తి స్క్రీన్ డిజైన్ మరియు క్వాడ్ కెమెరాలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ జీవిత కాలం 3410ఎంఏహెచ్ ఉంటుంది. జియోనీ S11 ఆండ్రాయిడ్ 7.1నౌగట్ OSను బాక్స్ నుంచి బయటకు తెస్తుంది.


Click it and Unblock the Notifications








